Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, September 30, 2021

విటమిన్ సి - అందంతో ఆరోగ్యం

 

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ సి ప్రధానమైనది. ఆరోగ్య పరిరక్షణకు విటమిన్ సి ఎంతో కీలకం. అయితే చర్మ సంరక్షణలో కూడా ఇది ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‎గా పని చేస్తూ చర్మ సంరక్షణలో పాలుపంచుకుంటుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

* మన శరీరానికి విటమిన్ సి తగినంత అందితే మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద ముడతలు మాయం అవడంతోపాటు నీరసం  కూడా దరిచేరదు. విటమిన్ సి శరీర కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడంతో పాటు ప్రోత్సహిస్తుంది. చర్మ కణాల్లో ఎలాస్టిన్ ఫైబ్రోబ్లాస్ట్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. దీని వల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మన దినచర్యలో భాగంగా విటమిన్ సి శరీరానికి అందేలా ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

* విటమిన్ సి రోజువారీ ఆహారంలో అందేలా జాగ్రత్తలు తీసుకుంటే.. చర్మం ప్రకాశవంతంగా మారడంతో పాటు మృదువుగా మారుతుంది. విటమిన్ సి మన చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. దీని వల్ల మన చర్మం చూడటానికి కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

* కొంతమందిలో ఎండ వల్ల చర్మం ఎర్రగా మారడం లేదంటే మండినట్లు అనిపించడం గమనిస్తుంటాం. అలాంటి వారు తమ స్కిన్ కేర్‎లో విటమిన్ సి ని కచ్చితంగా జోడించుకోవాలి. దీని వల్ల మండేతత్వం తగ్గడంతో పాటు ఎర్రగా అవడం కూడా చాలా వరకు తగ్గుతుంది.

* విటమిన్ సి కోసం చాలామంది సీరమ్‎ని వినియోగిస్తుంటారు. నిజానికి విటమిన్ సి సీరమ్స్ చర్మ సంరక్షణలో ఎంతో కీలకం. వీటి వినియోగం కూడా ఎంతో సులభం. ముందుగా చర్మాన్ని శుభ్రం చేసుకొని, ఆ తరువాత విటమిన్ సి సీరమ్స్‎ని అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

హైదరాబాద్‌కు పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌


అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్‌ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్‌ హాల్స్‌, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, యాంఫీ థియేటర్‌ లాంటి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దనున్నట్టు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పరిశ్రమలకు అందజేస్తున్న ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌లోని సానుకూల వాతావరణం, మౌలిక వసతులు తమను అమితంగా ఆకట్టుకున్నాయని, అందుకే భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామని ఆ కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపారాభివృద్ధిలో భాగంగా భారత్‌లో పెట్టుబడి పెట్టి ఇప్పటికే డజను మందికిపైగా అసోసియేట్స్‌కు శిక్షణ ఇచ్చిన పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌కు ప్రస్తుతం దేశంలో 400కుపైగా స్థానిక, అంతర్జాతీయ బ్లూచిప్‌ క్లయింట్లు ఉన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ డైనమిక్‌ సిటీగా పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌ సీఈవో, అధ్యక్షుడు క్రిస్‌ ఆడమ్స్‌ అభివర్ణించారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఐటీ, ఈ-కామర్స్‌ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి ఇదే కారణమని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేవని, నగరంలో ఒకచో ట నుంచి మరో చోటకు తక్కువ సమయంలో ప్రయాణించగలిగే సౌకర్యాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తమ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో తమ ప్రణాళికలను మరింత విస్తరించనున్నట్లు క్రిస్‌ ఆడమ్స్‌ చెప్పారు.

బి ఎస్ ఎన్ ఎల్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ పెంపు


భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒకే ఒక టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి రూ.699 ప్లాన్ ప్లాన్ యొక్క వాలిడిటీని పెంచింది. ఈ ప్లాన్ జనవరి 2021 లో 160 రోజుల చెల్లుబాటుతో ప్రకటించబడింది. అయితే ఇప్పుడు ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా రూ.699 వోచర్ వినియోగదారులకు 180 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. కొన్ని రోజుల క్రితమే సెప్టెంబర్ 28, 2021 లోపు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 180 రోజుల చెల్లుబాటును పొందుతారని ప్రకటించింది. ఇప్పుడు టెల్కో అదే ప్రమోషనల్ ఆఫర్‌ను పొడిగించింది. ఇది సెప్టెంబర్ 29, 2021 నుండి అమలులోకి లభిస్తూ డిసెంబర్ 27, 2021 వరకు అమలులో ఉంటుంది. రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం 180 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో 0.5GB రోజువారీ డేటాను కూడా పొందుతారు. రోజువారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను వినియోగించిన తర్వాత డేటా వేగం 80 Kbps కి పడిపోతుంది. వినియోగదారులు ఈ ప్లాన్ తో మొదటి 60 రోజుల పాటు కంపెనీ యొక్క ఉచిత PRBT సర్వీసును కూడా పొందుతారు. ఈ ప్రమోషనల్ ఆఫర్ యొక్క కొత్త ప్రయోజనాలు అన్ని టెలికాం సర్కిళ్లలోని వినియోగదారులకు వర్తిస్తాయి. అన్ని టెలికాం సర్కిల్‌లకు తమ వెబ్‌సైట్‌లో ఆఫర్‌ను అప్‌డేట్ చేయాలని మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కి నివేదించాలని సంస్థ ఆదేశించింది.

అతి తక్కువ ధరకే ఎల్ఈడి టీవీలు..!

 

రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఒక్కొక్క ఆఫర్ ను రివీల్ చేస్తూ కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ లో  కనిపిస్తున్న ఈ సరికొత్త టీవీ ఆఫర్ చూస్తుంటే ఈ విషయం మనకు స్పష్టం అవుతుందని చెప్పాలి.. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అతి తక్కువ ధరలకే మనం ఎల్ఈడి టీవీ లను కొనుగోలు చేయవచ్చు.. కేవలం ఎనిమిది వేల రూపాయల కంటే తక్కువ ధరకే సుమారుగా 32 అంగుళాలు కలిగిన బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ లను కొనుగోలు చేయవచ్చని సమాచారం.. ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సేల్ నుండి ఫ్లిప్కార్ట్ మనకు Blaupunkt బ్రాండ్ నుంచి ఎల్ఈడి టీవీ పైన అత్యంత భారీ ఆఫర్ను ప్రకటించింది..Blaupunkt BLA32AH410 మోడల్ నెంబర్ కలిగిన ఫ్యామిలీ సిరీస్ నుంచి ఎల్ఈడి టీవీ పై ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మనం ఏకంగా 55 శాతం డిస్కౌంట్ తో పొందవచ్చు. అంటే ఈ టీవి మనకు కేవలం రూ.7,999 కే లభించనుంది.. ఈ టీవీ గురించి మనకు ఫ్లిప్కార్ట్ లో కమింగ్ సూన్ అని ట్యాగ్ తో చూపిస్తోంది.. ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, మీ టీవీని cpu కూడా కనెక్ట్ చేసుకునే విధంగా ఒక వీజీఏ పోర్ట్ కూడా అమర్చబడి ఉంటుంది. ఈటీవీలో 2HMDI, 2USB , 30 W సౌండ్ , ఏ ప్లస్ గ్రేడ్ డి ఎల్ ఈ డి ప్యానల్ తో కూడా ఈ టివి మనకు లభిస్తుంది. అంతేకాదు అతి తక్కువ ధరకే ఇన్ని ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ రావడం ఇదే మొదటిసారి. ఈటీవీ ని ఫ్లిప్కార్ట్ సేల్ యాక్సిస్ బ్యాంకు లేదా ఐ సి ఐ సి ఐ డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి దాదాపుగా పది శాతం డిస్కౌంట్ ఆఫర్ కూడా లభించింది. నో కాస్ట్ ఇఎంఐ ద్వారా కూడా మీరు ఈ టీవీ ని కొనుగోలు చేయవచ్చు.

బెజవాడ రాజారత్నం

 


బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి, తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి, జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు కాకినాడ రాజరత్నం. వీరిలో కాకినాడ రాజరత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యువతి పాత్రలు ధరించేవారు. బెజవాడ రాజారత్నం గాయని, కానీ కాకినాడ రాజరత్నం గాయని కాదు. మొదట్నుంచీ బెజవాడ రాజరత్నం గాయని. సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రీయంగానూ, లలితంగానూ గీతాలు పాడడంలో నిపుణురాలు. ఆ రోజుల్లో రూపురేఖలు ఎలా వున్నా, పాట పాడగలిగే వాళ్లే నటీనటులు. అలా రాజరత్నం ముందు రంగస్థలం మీద నటిస్తూ పాటలు, పద్యాలతో రాణించింది. మనిషి బక్కగా వుండేది. చెప్పుకోవాలంటే అందమైన ముఖం కూడా కాదు. కాని, గాయనిగా అర్హతలుండడంతో, నాటకాల్లో నటించింది; సినిమాల్లోనూ ప్రవేశించింది. సినిమాలకి రాకముందు ఆమె గ్రామ్‌ఫోన్‌ కంపెనీకి పాడింది. ట్విన్‌ కంపెనీ ద్వారా రెండు రికార్డులు విడుదలైనాయి. ఒక రికార్డులో 'మా రమణ గోపాల', 'శృంగార సుధాకర' అని రెండు పాటలు వుండగా, ఇంకో రికార్డులో 'హాయి హాయి కృష్ణ'; 'చిరు నగవులు చిందుతూ' అన్న పాటలు పాడిందామె. అన్నీ భక్తి పాటలే. అయితే ఆ రోజుల్లో రికార్డు మీద పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరిచారో వుండేది కాదు. ఈ రికార్డు మీద 'మిస్‌ రాజరత్నం' అన్న పేరే వుంటుంది. దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా సీతాకల్యాణం (1934)లో రాజరత్నం సీత. అంతవరకూ ఉత్తర దేశంలో నిర్మితమవుతూ వచ్చిన తెలుగు సినిమాలు- 'సీతా కల్యాణం'తో మద్రాసులో మొదలైనాయి. పినపాక వెంకటదాసు గారు, వేల్‌ పిక్చర్స్‌ పేరుతో తడికెలతో స్టూడియో (ఆళ్వార్‌పేటలో) కట్టి 'సీతాకల్యాణం' తీశారు. చిత్రపు నరసింహారావు దర్శకుడు. కల్యాణి అనే ఆయన రాముడు. రాజరత్నానికి ఇది తొలి సినిమా. మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా, నాటకాల్లోనూ నటిస్తూ- మళ్లీ పెళ్ళి (1939) చిత్రంలో నటించిన పాత్రకూ, పాడిన పాటలకీ ప్రశంసలు లభించాయి. రాజరత్నం ఇందులో రెండో నాయిక. ప్రధాన నాయిక కాంచనమాల. కొచ్చర్లకోట సత్యనారాయణ, రాజరత్నం జంట. ఆమె పాడిన 'చెలి కుంకుమమే, పావనమే', 'కోయిలరో, ఏదీ నీ ప్రేమగీతి', 'గోపాలుడే' పాటలు ఆ రోజుల్లో చాలా పాపులరు. కాంచనమాలతో కలిసి పాడిన 'ఆనందమేగా వాంఛనీయము' కూడా అందరూ పాడుకునేవారు. ఈ సినిమాతో రాజరత్నానికి మంచి పేరు వచ్చినా, నాటకాల్లో కూడా నటించేది. వై.వి.రావు అటు తర్వాత తీసిన విశ్వమోహిని (1940)లో నటించిందామె. 'ఈ పూపొదరింటా' పాట జనరంజకమైంది. పెద్ద హిట్టయిన 'మళ్లీ పెళ్ళి' తర్వాత, అంతటి పెద్ద హిట్టూ బి.ఎన్‌.రెడ్డిగారి దేవత (1941). చిత్తూరు నాగయ్య సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట- 'రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ' ఇప్పటికీ నాటితరం వారికి బాగా గుర్తు. అలాగే అందులో ఆమె 'నిజమో కాదో', 'ఎవరు మాకింక సాటి' పాటలు కూడా పాడింది. ఇంకో పాట కూడా అందరి నోటా వినిపించేది. అది 'జాగేలా వెరపేలా త్రాగుము రాగ సుధారసము'. ఈ పాటలన్నీ సముద్రాల రాఘవాచార్య రాశారు. సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్‌ గీతాలు గ్రామ్‌ఫోన్‌కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్‌ విధానం వస్తోంది. వందేమాతరం(1939)లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్‌ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్‌ చేసి చిత్రీకరించినది- మళ్లీ పెళ్లిలో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు. 1943లో వాహిని వారి భక్తపోతన విడుదలైంది. ఈ సినిమాలో రాజనర్తకి సామ్రాజ్యానికి 'ప్లే బాక్‌' పాడినది - బెజవాడ రాజరత్నం. ఈ విధంగా తెలుగు సినిమాల్లోని మొదటి నేపథ్య గాయనిగా రాజరత్నం చరిత్రకెక్కింది. 1943లో వచ్చిన భాగ్యలక్ష్మిలో రావు బాలసరస్వతీ దేవి 'తిన్నెమీద సిన్నోడ' పాడారు- కమలా కోట్నీస్‌కి. 'భక్తపోతన' రికార్డు మీద రాజరత్నం పేరుంది. ఇది మంచి సమయము రారా అన్నది ఆ పాట. అదేకాదు- పోతన సినిమాలో నాగయ్య, మాలతి, నాళం వనజాగుప్త- 'మానవసేవే- మాధవసేవా' పాట పాడారు; కాని, గ్రామ్‌ఫోన్‌ రికార్డులో బెజవాడ రాజరత్నం - మాలతి పాడిన చరణాలు పాడింది. నాగయ్య, వనజాగుప్తలు మళ్లీ పాడారు. ఇదొక విశేషం. రాజరత్నం తమిళంలో కూడా నటించి, పాటలు పాడింది. 'మోహిని' అనే చిత్రంలో నాయిక మాధురికి ప్లేబాక్‌ పాడిందామె. జెమిని వారి జీవన్ముక్తి (1942)లో రాజరత్నం నటించి, పాడింది. ఆమె, సూరిబాబు కలిసి పాడిన 'జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా' పాట అప్పట్లో ప్రజల నోట వినిపించేది. ఘంటసాల బలరామయ్య తీసిన ముగ్గురు మరాఠీలు (1946) రాజరత్నం చిన్నపాత్ర ధరించి రెండు పాటలు పాడింది. అయితే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించలేదు; ఎక్కువ నేపథ్య గీతాలూ పాడలేదు. మంచి కంఠంతో, హాయిగా పాటలు పాడేది గనక, పాటలున్న పాత్రలుంటే ఆమె చేత నటింపజేసి పాడించేవారు. ఆమె పాడిన పాటలన్నీ పాపులర్‌ అయినాయి. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత విజయ సంస్థ నిర్మించిన జగదేకవీరుని కథ (1961)లో 'జలకాలాటలలో' పాటలో రాజరత్నం కూడా పాడింది- నలుగురిలో ఒకరికి. దీని తర్వాత పాడిన దాఖలాలు లేవు. బెజవాడ రాజరత్నం పేరు చెబితే, సినిమా సంగీతపు నూతన యవ్వనంలో ఒక మధుర తరంగం జ్ఞాపకం వస్తుంది. ఆమె పాడుతుంటే అది ఒక తేనె వాగు. నేర్చి, వల్లెవేసి ముక్కున పట్టి అప్పజెప్పిన పాట కాదు. సాధన వలన, శిక్షణ వలన సిద్ధించినదీ కాదు. దైవదత్తమైన వరం! అని- సినిమా సంగీత విశ్లేషకుడు, పరిశోధకుడూ వి.ఎ.కె. రంగారావు ఒక సందర్భంలో రాశారు.

శభాష్ తాత ...!

 Wednesday, September 29, 2021

ఎస్‌బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!

 

దసరా పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ కార్డ్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సమయంలో మొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ల్యాప్ టాప్స్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి మొదలైన ఏ కేటగిరీల్లోనైనా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే సమయంలో ఈఎమ్ఐ కింద కొనుగోళ్లు చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపింది. వాటి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం ఎస్‌బీఐ కార్డ్. కామ్ సందర్శించండి అని తెలిపింది.

యూనికార్న్‌ క్లబ్‌లోకి వేదాంతు ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ కంపెనీ..!

 


కరోనా రాకతో విద్యారంగంలో భారీ మార్పులే వచ్చాయి. పాఠశాలలు విద్యార్ధులకు పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించాయి. ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ సర్వీసులు భారీ వృద్దినే నమోదు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ సర్వీస్‌ సంస్ధ వేదాంతు యునికార్న్‌ స్టార్టప్‌గా అవతరించింది. సింగపూర్‌కు చెందిన ఏబీసీ వరల్డ్ ఆసియా కంపెనీ నుంచి సుమారు 100 మిలియన్‌ డాలర్లను సేకరించడంతో వేదాంతు స్టార్టప్‌ వాల్యూయేషన్‌ ఒక బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. వేదాంతుకు టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, కోట్ మేనేజ్‌మెంట్, జీజీవీ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లుగా నిలిచాయి. బైజూస్‌, ఆన్‌ అకాడమీ, అప్‌గ్రేడ్‌, ఏరుడిటస్‌ తరువాత ఐదో భారతీయ ఎడ్‌టెక్‌ యునికార్న్‌ సంస్థగా వేదాంతు నిలిచింది. వేదాంతు ఏడు సంవత్సరాల క్రితం తన లైవ్-ట్యూటరింగ్ సేవలను ప్రారంభించింది.2022 మార్చి నాటికి 500,000 యూజర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండు లక్షల మంది విద్యార్థులు వేదాంతులో ఎన్‌రోల్‌ చేసుకున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. కరోనా రాకతో పలు ప్రైవేటు టీచర్ల దుస్థితి దయనీయంగా మారింది. వేదాంతు సహాయంతో పలువురు ప్రైవేటు టీచర్లు వేదాంతులో ట్యూటర్‌గా జాయిన్‌ అయ్యారని కృష్ణ వెల్లడించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్‌ !

 


భారత్​లో వీడియో స్ట్రీమింగ్​ ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు భారీ డిమాండ్​ ఏర్పడింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారింది. ప్రస్తుతం తక్కువ ధరలోనే మొబైల్ ఇంటర్నెట్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. మరోవైపు కరోనా భయంతో జనాలు థియేటర్లకు రావడం దాదాపుగా మానేశారు. అందుకే నిర్మాణ సంస్థలు సైతం కొత్త సినిమాలను ఓటీటీల్లోనే విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. వెబ్​సిరీస్​ల నుంచి ఒరిజినల్​ షోల వరకూ అన్ని భాషల కంటెంట్​ ఓటీటీల్లోనే రిలీజ్​ అవుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు గేమ్స్ అడుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గతంలో నెట్‌ఫ్లిక్స్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ను కూడా తీసుకు వస్తోందనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రముఖ గేమింగ్‌ దిగ్గజం నైట్‌ స్కూల్‌ స్టూడియోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైట్‌ స్కూల్‌ స్టూడియోకు చెందిన ఐదు మొబైల్‌ గేమ్స్‌ను యూరోపియన్‌ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసింది.

మళ్లీ పేలిన వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌

 

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీదారు వన్‌ ప్లస్‌ నుంచి విడుదలైన నార్డ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ సంస్థకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ తన దగ్గరున్న వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5G ఫోన్‌ పేలిపోయిందని చెప్పిన ఘటన మరవక ముందే, మరోసారి ఈ ఫోన్‌ పేలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కేరళకు చెందిన జిమ్మీ జోస్‌ అనే వ్యక్తి వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఫోన్‌ ఛార్జ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఛార్జర్‌ పేలిపోయిందని తెలిపారు. ఇది ఎలా పేలిందనే వివరాలన్నీ పూసగుచ్చినట్టు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని వన్‌ప్లస్‌ సంస్థ గుర్తించింది. కానీ ఎప్పటిలాగే ఈ ఘటనలో తమ ఫోన్‌ లోపం ఏ మాత్రం లేదని, వోల్టేజ్‌ ఫ్లక్చువేషన్స్‌ వల్ల అది పేలి ఉండవచ్చని పేర్కొంది. కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జిమ్మీ జోస్‌.. తన వన్‌ ప్లస్‌ నార్డ్ 2 5జీ ఫోన్‌ ఛార్జింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పెద్ద శబ్ధంతో ఛార్జర్‌ పేలిపోయిందని చెప్పారు. ఆ తీవ్రతకు కనెక్ట్‌ చేసిన సాకెట్‌ దూరంగా ఎగిరిపోయిందని తెలిపారు. అయితే ఫోన్‌ మాత్రం పనిచేస్తోంది. ఈ ప్రమాదంలో తనకు పెద్ద గాయాలేమి కాలేదు కానీ అది పెద్ద షాక్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన వెంటనే వన్‌ ప్లస్‌ సంస్థకు తెలియజేయగా వారు కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ సందర్శించాలని సూచించారు. కరెంట్‌ ఎక్కువ రావడం వల్ల ఛార్జర్‌ పేలి ఉంటుందని వన్‌ ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ వారు తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న జోస్‌, ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేందుకు తాను వోల్టేజ్‌ స్టెబిలైజర్‌ కూడా కొనుగోలు చేసే ఉండాల్సిందని కామెంట్‌ చేశారు. పేలిపోయిన ఛార్జర్‌ తీసుకొని కొత్త ఛార్జర్‌ ఇచ్చింది వన్‌ప్లస్‌. తమ లోపం కాదని కంపెనీ చెప్తున్నా, అక్కడి టెక్నిషియన్లు మాత్రం స్విచ్‌ ప్యానెల్‌/సాకెట్‌లో లోపం లేదా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పేలి ఉండవచ్చని విశ్లేషించారు. దాన్ని పేలుడుగా పరిగణించరాదని అంటున్నారు. ఇలాంటి ఘటనలను తాము తీవ్రంగా తీసుకుంటున్నామని న్యూస్‌18కు ఇచ్చిన వివరణలో వన్‌ ప్లస్‌ ప్రతినిధి తెలిపారు. వన్‌ ప్లస్‌ ఛార్జర్లలో బిల్ట్ ఇన్‌ కెపాసిటర్లు ఉంటాయని, ఈ ఘటనలో పవర్‌ స్టోర్ చేసే ఆ కెపాసిటర్లు యథాతథంగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇతర ఎక్స్‌టర్నల్‌ కారణాల వల్లే పేలి ఉంటుందని వివరించారు. అంతే కాదు, యూజర్ మ్యానువల్‌లో సూచించిన ముందు జాగ్రత్తలు, హెచ్చరికలను యూజర్లు పాటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ దగ్గర కూడా ఈ వన్‌ప్లస్‌ నార్డ్ 2 స్మార్ట్‌ ఫోన్ పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా తాను గాయపడ్డానని కూడా ఆ లాయర్ తెలిపారు. దీనిపై వన్‌ ప్లస్‌ స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు చేపడతానని ప్రకటించారు. మరో వైపు ఈ విషయంలో వన్‌ ప్లస్‌ సంస్థ ఆ ఢిల్లీ లాయర్‌కు లీగల్‌ నోటీసు పంపించింది. తమ కంపెనీని అపఖ్యాతి పాలుజేయరాదని, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగులు తొలగించాలని కోరింది. ఈ తరహా ఘటనే బెంగళూరులో కూడా జరిగింది. ఒక మహిళ బ్యాగులో వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఫోన్‌ పేలిపోయింది. ఆమె విషయంలో కూడా కంపెనీ తమ తప్పేమీ లేదని, ఇతర కారణాల వల్లే పేలుడు జరిగి ఉంటుందని చేతులు దులుపుకుంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా శాస్త్రవేత్తలు

 


కార్బన్‌డయాక్సైడ్ అంటే మనకు కాలుష్యమే గుర్తుకొస్తుంది. గాల్లో కలిసిపోయి మనిషి శ్వాస వ్యవస్థ మీద దాడిచేస్తుంది. ఓ పక్క పెరుగుతున్న కాలుష్యం మరో పక్క చెట్ల నరికివేత. వెరసి కార్బన్ డయాక్సైడ్ ప్రమాదకంగా మారుతోంది. చెట్ల కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని మనకు ఆక్సిజన్నిస్తాయి. ఆ ఆక్సిజన్ ను మనం పీల్చుకుని కార్బన్‌డయాక్సైడ్ ను బయటకు వదులుతాం. ఇది కంటికి కనిపించని ప్రక్రియ. ఇదిలా ఉంటే కంటికి కనిపించని గాలిలో కలిసిపోయిన కార్బన్‌డయాక్సైడ్ ను పిండిపదార్ధంగా మార్చేస్తే?!.. మొక్కలకు అది సాధ్యమే. మరి మనిషికి అది సాధ్యమవుతుందా? మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా  కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. దానికి కోసం మొక్కలకు నీరు అవసరం. కానీ ఇప్పుడు మొక్కలే కాదు  మనిషికి కూడా అది సాధ్యమేనని నిరూపించారు చైనా శాస్త్రవేత్తలు. అంటే కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చి చూపించారు శాస్త్రవేత్తలు. పిండి పదార్థం తయారు కావాలంటే బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్‌డయాక్సైడ్‌ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? అని ఆలోచించారు చైనా శాస్త్రవేత్తలు. అనుకున్నదే తడవుగా ఆ ప్రక్రియ మొదలు పెట్టి దాన్ని సాధించారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయని ముందే చెప్పుకున్నాం కదా..ఈ ప్రక్రియలో భాగంగా 60కి పైగా రసాయనిక చర్యలు జరుగుతుంటాయి. కానీ అంతకంటే ఈజీగా పిండిపదార్థాన్ని తయారు చేయటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. దీనిపై కసరత్తులు చేసిన చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎంతో వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చిచూపించారు. ఈ ప్రయోగాల్లో విజయం సాధించారు. ఇలా మొక్కలంటే వేగంగా కార్బన్ డయాక్సైడ్ ను పిండిపదార్ధంగా తయారు చేసే పరిశోధనలకు చీటావో అనే శాస్త్రవేత్త సారధ్యం వహించారు. సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సహయాంతో చక్కెరలుగా మార్చడం..వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేస్తున్న కీటకనాశినులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని భారీగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు ప్రముఖ శాస్త్రవేత్త చీటావో.

ఒకే నెలలో రూ.900 కోట్లు !

 

ది ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్ ఝున్ వాలా స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టె విషయం అందరికీ తెలిసిందే. అయితే, స్టాక్ మార్కెట్ అందరికీ కనక వర్షం కురిపించదు. స్టాక్ మార్కెట్‎పై పట్టు ఉన్న వారిని మాత్రమే లక్ష్మీ దేవి కరుణిస్తుంది. ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పిలిచే "బిగ్ బుల్ రాకేష్‌ ఝున్ ఝున్ వాలా" కొనుగోలు చేసిన టాటా మోటార్స్ షేరు ధర సుమారు 13 శాతం పెరగగా, టైటాన్ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఈ రెండు కంపెనీల షేరు భారీగా పెరగడంతో రాకేష్ ఝున్ ఝున్ వాలా నికర విలువ ఒక నెలలోనే ₹893 కోట్లు పెరిగింది. టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం బిగ్ బుల్ 3,77,50,000 షేర్లను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో ప్రతి ఈక్విటీ షేర్ల ధర ₹287.30 నుంచి ₹331కు పెరిగింది. ప్రతి షేరు విలువ ₹43.70 పెరిగింది. దీంతో, రాకేష్‌ జున్‌జున్‌వాలా సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ వాటా హోల్డింగ్ నుంచి ₹164.9675 కోట్లు సంపాదించారు. అలాగే, టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. 'బిగ్ బుల్' 3,30,10,395 షేర్లను కలిగి ఉండగా, రేఖా జున్‌జున్‌వాలా(రాకేష్‌ జున్‌జున్‌వాలా భార్య) 96,40,575 వాటాలను కలిగి ఉన్నారు. కాబట్టి, ఇద్దరి పేరు మీద కలిసి టైటాన్ లో 4,26,50,970 షేర్లు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో టైటాన్ షేర్లు ₹1921.60 నుంచి ₹2092.50కు పెరిగింది. ఈ కాలంలో టైటాన్ కంపెనీ షేరు విలువ ₹170.90కి పెరిగింది. ఈ కంపెనీ షేర్ల విలువ ప్రకారం.. రాకేష్‌ జున్‌జున్‌వాలా ₹728.90 కోట్లు సంపాదించారు. కాబట్టి, ఈ రెండు టాటా గ్రూప్ స్టాక్స్ లో బిగ్ బుల్ నికర విలువ సెప్టెంబర్ 2021లో 893.87 కోట్లు పెరిగింది. జున్‌జున్‌వాలా తన స్వంత పేరు, అతని భార్య రేఖా పేరుతో రెండింటిలోనూ భారీగా పెట్టుబడి పెట్టారు.

సెలబ్రెట్‌ దీపావళి విత్‌ ఎమ్‌ఐ


ప్రముఖ చైనీస్‌ దిగ్గజం షావోమీ దీపావళి సందర్భంగా 'సెలబ్రెట్‌ దీపావళి విత్‌ ఎమ్‌ఐ' సేల్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సేల్‌కు సంబంధించిన డిస్కౌంట్లను, ఆఫర్లను షావోమీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌, స్మార్ట్‌టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో పాల్గొనే కస్టమర్లకు ముందుగానే సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు ప్రీబుకింగ్స్‌ చేసుకోనే సౌకర్యాన్ని షావోమీ కల్పిస్తోంది. పలు షావోమీ ఉత్పత్తులపై సుమారు రూ. 5,000 నుంచి రూ. 75,000 వరకు డిస్కౌంట్లను షావోమీ అందించనుంది. దీపావళి విత్ మి సేల్ రివార్డ్ మి ఇన్‌స్టంట్ కూపన్‌ల ద్వారా రూ. 5,000 వరకు తగ్గింపును షావోమీ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చును. షావోమి అందిస్తోన్న ఆఫర్ల విషయానికొస్తే, దీపావళి విత్‌ ఎమ్‌ఐ సేల్‌లో షావోమీ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎమ్‌ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాలపై ధర తగ్గింపు ఉంటుంది. రెడ్‌మీ 9ఏ 2జీబీ ర్యామ్‌+32ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 6,799 అందిస్తోంది. దీని అసలు ధర రూ .8,499. షావోమి ఎమ్‌ఐ 11 ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు షావోమీ తన వెబ్‌సైట్‌లో టీజ్‌ చేసింది. 75 అంగుళాల ఎమ్‌ఐ క్యూఎల్‌ఈడీ టీవీపై సుమారు రూ .75,000 తగ్గింపు న అందించనుంది. దీని అసలు ధర రూ. 1,99,999. 50 అంగుళాల ఎమ్‌ఐ టీవీ 5ఎక్స్‌ మోడల్‌పై రూ. 20,000 తగ్గింపును సేల్ సమయంలో పొందవచ్చు. 40 అంగుళాల ఎమ్‌ఐటీవీ 4ఏ రూ. 8,000 తగ్గింపును ప్రకటించనుంది. 

రూ.100 కే బంగారం !

 

బంగారం మీద భారతీయులకు ఉన్న ఈ మోజుని క్యాష్ చేసుకునేందుకు జువెలరీ కంపెనీలు ప్లాన్ చేశాయి. జువెలరీ కంపెనీలు మరో అడుగు ముందుకేశాయి. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పాయి. రూ.100కే బంగారం అందించే ప్లాన్స్ తో జువెలరీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. బంగారం ధరలు భగ్గుమంటున్నా ఈ పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్‌ జువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా బంగారం అందించే ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. కంపెనీ వెబ్‌సైట్లలో లేదా ఇతర థర్డ్‌యాప్స్‌ ద్వారా విక్రయించే ఆఫర్‌లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్‌ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్‌ జువెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్‌కు కొత్తేమీ కాదు… పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి మొబైల్ వ్యాలెట్స్‌ డిజిటల్‌ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్‌ఫామ్ లు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్‌ గోల్డ్ ఆయా మొబైల్‌ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్మాంట్ గోల్ట్‌ డైరక్టర్‌ కేతన్‌ కొఠారి తెలిపారు. దసరా, ధంతేరాస్‌, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు గోల్డ్‌ జువెలరీ వర్గాలు తెలిపాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్.. జువెలర్స్ మైండ్ సెట్ మార్చేసింది. ఆన్ లైన్ అమ్మకాలవైపుగా దృష్టి పెట్టేలా చేసింది అని అగ్మాంట్ గోల్డ్ డైరెక్టర్ కేతన్ చెప్పారు. అగ్మాంట్ గోల్డ్ కి 4వేలకిపై జులెవర్ పార్టనర్స్ ఉన్నారు. దేశంలో పండుగల సీజన్ రానుంది. దీంతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు జులెవరీ కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించాయి. ఇక దేశంలో బంగారం డిజిటల్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. ముఖ్యంగా యంగస్టర్లు ఎక్కువగా ఆన్ లైన్ లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని కళ్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణ్ రామన్ అన్నారు. ఆభరణాల వెబ్‌సైట్లలో ఆభరణాల విక్రయం సహా ఆన్‌లైన్ బంగారం కొనుగోళ్లు 2019 లో మొత్తం అమ్మకపు విలువలో కేవలం 2% మాత్రమే ఉండగా, ఈ లావాదేవీలలో ఎక్కువ భాగం 45 ఏళ్లలోపు వ్యక్తులు చేసినట్లు గతేడాది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతోంది.

నాసా విడుదల చేసిన అంతరిక్షంలో అద్భుతం...!


అంతరిక్షంలో వింతలు.. పాల పుంతలు.. కనిపించేవన్నీ అద్భుతాలు.. అలాంటి మరెన్నో చిత్రాలను నాసా విడుదల చేస్తోంది. తాజాగా మరో అద్భుతమైన రహస్యాన్ని ట్వీట్ చేసింది. అంతరిక్షంలో దేవుడి చేయి అంటూ పోస్ట్ చేసింది. ఏది ఏమైనా నాసా విడుదల చేసిన తాజా చిత్రాలు మరోసారి సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. చేతిని పోలిన ఆకారం నింగిపై దర్శనమివ్వడం.. ఆ సుస్పష్ట ఆకారం వెలుగులు విరజిమ్మడం.. కొత్త ఊహలకు తావిస్తోంది. మన విశ్వం అద్భుతాలతో నిండి ఉంది. దీని అందం అసమానమైనది. కొన్నిసార్లు మనం దాని అందాన్ని చూడవచ్చు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తరచుగా విశ్వంలో కనిపించే చిత్రాలను విడుదల చేస్తుంటుంది. ఇటీవల నాసా అటువంటి చిత్రాన్ని పంచుకుంది. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రానికి 'హ్యాండ్ ఆఫ్ గాడ్' అని పేరు పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు. అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా తీసిన చిత్రాలను నాసా షేర్ చేసింది. 'అంతరిక్షంలో దేవుడి చేయి' ఈ చిత్రంలో దాని నేపథ్యంలో నల్లని ప్రదేశం కనిపిస్తుంది. అదే సమయంలో, ఒక బంగారు నిర్మాణం ఇందులో కనిపిస్తుంది. ఇది ఒక చేతిలా కనిపిస్తుంది. నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'గా పిలుస్తున్నారు. దీనికి 'నాసా హ్యాండ్ ఆఫ్ గాడ్' అని పేరు పెట్టడానికి కారణం ఇదే. ఈ నిర్మాణం శూన్యం నుండి ఉద్భవించినట్లు కనిపిస్తుంది. కొంత అత్యున్నత శక్తి దాని ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. చిత్రంలో అనేక ఫ్లాషింగ్ లైట్లు కనిపిస్తాయి. అవి చేతి ఆకారంలో ఉంటాయి.

చైనాలో మరో సంక్షోభం!ప్రపంచ కర్మాగారంగా పేర్కొందిన చైనాలో ఏ సంక్షోభమొచ్చినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దివాలా అంచున ఉన్న స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ సమస్య ఇంకా సమసిపోకముందే.. మరో సంక్షోభం వచ్చింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్‌ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ లైట్లు సైతం వెలగడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిని కనీసం కొన్ని నెలల పాటైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చైనాలో విద్యుత్తు కొరతకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ ఆంక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యం పుంజుకోవడంతో చైనాలో ఉత్పత్తి పెరిగింది. దీంతో విద్యుత్తుకు ఒక్కసారిగా గిరాకీ పుంజుకుంది. 2020తో పోలిస్తే 2021లో విద్యుత్తు వినియోగం 13 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదు. చైనాలో ఎక్కువ శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోంది. ఇదే సమయంలో బొగ్గు కొరత కూడా రావడం సమస్యను మరింత తీవ్రం చేసింది. మరోవైపు ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దీంతో బొగ్గు ఆధారిత కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. డిమాండ్‌కు సరిపడా స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచకపోవడంతో విద్యుత్తు కోతలు తప్పడం లేదు. విద్యుత్తు డిమాండ్‌ 13 శాతం పెరిగితే.. బొగ్గు ఉత్పత్తి 6 శాతం మాత్రమే పెరిగింది. మరోవైపు రెండు నెలల క్రితం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ దేశంలో రెండు ప్రధాన పోర్టులను మూసివేశారు. దీంతో బొగ్గు దిగుమతులు దెబ్బతిన్నాయి. ఇది కూడా బొగ్గు కొరతకు ఓ కారణమయింది. బొగ్గు కొరతకు కూడా చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా 2060 నాటికి కర్బన రహిత దేశంగా మారాలన్న లక్ష్యం పెద్ద అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అక్కడి షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం అనేక నిబంధనలను రూపొందించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు లభించినా వెంటనే బొగ్గు ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. పైగా చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణం. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొన్ని బొగ్గు గనులను మూసివేసింది. వీటిని ప్రారంభించడం కూడా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ప్రారంభమైనా ఉత్పత్తి ఊపందుకోవడానికి నెలల సమయం పడుతుంది. చైనా బొగ్గు వనరుల్లో దిగుమతులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి భారీ ఎత్తున బొగ్గు వచ్చేది. కానీ, భౌగోళిక రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం డ్రాగన్‌ ఆపేసింది. ఇటీవల ఇరు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవలే 'ఆకస్‌' కూటమి ఏర్పాటు కావడంతో ఇప్పట్లో బొగ్గు దిగుమతిని ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు. కర్బన రహిత లక్ష్యంలో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడి రాష్ట్రాలకు టార్గెట్‌లు నిర్దేశించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కూడా విద్యుత్తు కోతలకు దారి తీస్తోంది. విద్యుదుత్పత్తిలో జల, పవన, సౌర వనరుల వాటా పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 2025 నాటికి 20 శాతం విద్యుత్తు డిమాండ్‌ను ఈ వనరులతో తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వర్షాలు ఆలస్యంగా కురవడంతో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పవన విద్యుత్తు కేంద్రాల్లోనూ ఉత్పత్తి పడిపోయింది. ముఖ్యంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉత్పత్తి పెంపునకు సుముఖంగా లేవు. దీనికి  ప్రధాన కారణం బొగ్గు ధరలు పెరగడమే. రవాణా చార్జీలు పెరగడం, వెలికితీత వ్యయాలు ఎగబాకడంతో పాటు డిమాండ్‌ సరిపడా బొగ్గు లేకపోవడంతో బొగ్గు ధరలు పెరిగాయి. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రాలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఒకవేళ ఉత్పత్తిని పెంచినా విద్యుత్తు ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్థానిక ప్రభుత్వాలు ఆయా సంస్థలకు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఇది మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. తిరుగులేని అధికారంతో ముందుకెళ్తున్న షీ జిన్‌పింగ్‌ లక్ష్యాల్లో చైనాను కర్బన రహితంగా మార్చాలన్నది ముందు వరుసలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఆయన ప్రభుత్వం రాజీపడే అవకాశం లేదనే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా స్థానిక ప్రభుత్వాల ప్రణాళికలేమి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఆరోపించడాన్ని బట్టి చూస్తే.. పర్యావరణ లక్ష్యాల విషయంలో రాజీపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ కర్బన రహిత లక్ష్యాలను జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు. చైనాలో పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగానూ ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా జీడీపీలో మూడో వంతు వాటా కలిగిన జీయాంగ్‌సూ, ఝెజియాంగ్‌, గువాంగ్‌డోంగ్‌ ప్రావిన్సుల్లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశ పవర్‌ హౌస్‌లుగా భావించే ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి దెబ్బతింటే ఆ ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. 

ఒక్క టవర్ నే కూలుస్తాం...!


నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేయాలంటూ గత నెల ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్‌ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, అందుకు న్యాయస్థానం అంగీకరించాలని అభ్యర్థించింది. తీర్పును తాము సవాల్‌ చేయడం లేదని, అయితే తీర్పును మార్చడం వల్ల కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందిగా ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి కట్టిన ఈ భవనాలను నిపుణుల పర్యవేక్షణలో మూడు నెలల్లోపు సొంత ఖర్చులతో సూపర్‌టెక్‌ కంపెనీయే కూల్చాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక, ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కొన్న వారికి బుక్‌ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పుపై సూపర్‌టెక్‌ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్‌ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, రెండోదాన్ని అలాగే ఉంచుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ''ఒక టవరు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. అందుకే దాన్ని కూల్చొద్దు అనుకుంటున్నాం. పక్కనే ఉన్న మరోదాన్ని కూలుస్తాం. మేం సుప్రీం తీర్పును, న్యాయవ్యవస్థను సవాల్‌ చేయాలనుకోవట్లేదు. అయితే ఒక్క టవర్‌నే కూల్చడం వల్ల కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి. అంతేగాక, కూల్చివేసిన టవర్‌ ప్రాంతంలో గ్రీన్‌జోన్‌ను ఏర్పాటు చేస్తాం'' అని సూపర్‌టెక్‌ సంస్థ అభ్యర్థించింది. ఈ టవర్లలో మొత్తం 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. రెండు టవర్స్‌ మధ్య కనీస దూరం పాటించడం లేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ లేఖ రాసినా నోయిడా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ టవర్స్‌ నిర్మాణంపై రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏళ్ల పాటు న్యాయపోరాటం చేయగా  భవనాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 

గుండె జబ్బులు ఎన్ని రకాలు?

 


పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ప్రతిక్షణం రక్తాన్ని చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కొందరు దురలవాట్లతో, అనారోగ్యకరమైన జీవనశైలితో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 86 లక్షల మందికిపైగా గుండెజబ్బులతో అకాల మరణం చెందుతున్నారు. గుండె, రక్తనాళాల వ్యాధుల సమూహాలను కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌లు అని అంటారు. గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న 80% కంటే ఎక్కువ మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌లు ఉన్న రోగుల్లో మూడింట ఒక వంతు మంది అకాల మరణం చెందుతారు. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి, ప్రతియేటా సెప్టెంబర్ 29న 'వరల్డ్‌ హార్ట్‌ డే' జరుపుతున్నారు. హృదయ వ్యాధుల ప్రారంభ సంకేతాలను త్వరగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. అయితే ఈ సంకేతాలు లేదా లక్షణాలు హృదయ వ్యాధుల రకాలను బట్టి మారుతుంటాయి. 

గుండె జబ్బుల రకాలు:

*  రక్తనాళ వ్యాధి- కొరోనరీ ఆర్టరీ (హృదయ ధమని) ఆరోగ్యం దెబ్బ తిన్నట్లుగా ఈ వ్యాధి సంభవిస్తుంది.

*  అరిథ్మియాస్- ఇది అసాధారణ హృదయ స్పందనను సూచిస్తుంది.

*  పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు- దీనిని పుట్టుకతో వచ్చే గుండె లోపాలు అని పిలుస్తారు. ఈ జబ్బు బారిన పడిన వారిలో గుండె అసాధారణంగా పనిచేస్తుంది

*  గుండె కవాటాల వ్యాధి 

*  గుండె కండరాల వ్యాధి

*  గుండె ఇన్‌ఫెక్షన్ 

పైన పేర్కొన్న వివిధ రకాల గుండె జబ్బుల కారణంగా మొదటగా బయటపడే లక్షణాలు :

రక్త నాళాలలో గుండె జబ్బులు, ఛాతీలో నొప్పి, బిగుతు లేదా ఒత్తిడి, చేతులు లేదా కాళ్లలో నొప్పి.. బలహీనత.. జలుబు.. కాళ్లు లేదా చేతుల్లో తిమ్మిరి.. శ్వాస ఆడకపోవుట, మెడ, దవడ, గొంతు, పొత్తికడుపు, వెన్నెముక భాగంలో నొప్పి. ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే వైద్యున్ని సంప్రదించి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది.

అరిథ్మియాస్ : ఛాతీలో దడ.. అతి వేగమైన హృదయ స్పందన (టాచీకార్డియా).. స్లో హార్ట్ బీట్ (బ్రాడీకార్డియా).. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం.. శ్వాస ఆడకపోవుట, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.. మూర్ఛపోవడం (సింకోప్) వంటి లక్షణాలు అరిథ్మియాస్ గుండె జబ్బు ఉన్న వారిలో కనిపిస్తాయి.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు : చర్మం రంగు లేత లేదా నీలం (సైనోసిస్) గా మారడం.. ఉదరం, కాళ్లు లేదా కళ్ల చుట్టూ వాపు రావడం.. తినేటప్పుడు చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గుండె కండరాల వ్యాధి : విశ్రాంతి సమయంలో లేదా చురుకుగా ఉన్నప్పుడు ఊపిరి ఆడకపోవడం.. అలసట.. కాళ్లు, పాదాలు, మడమల్లో వాపు.. అస్తవ్యస్తమైన హృదయ లయ, వేగవంతమైన, కొట్టుకునే లేదా కొట్టుకునే హృదయ స్పందనలు.. మైకము.. మూర్ఛపోవడం లక్షణాలు కనిపిస్తే కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం తక్షణావసరం.

హార్ట్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి : జ్వరం.. అలసట లేదా బలహీనత.. ఉదరం లేదా కాళ్ళలో వాపు.. శ్వాస ఆడకపోవుట.. హృదయ స్పందనలో మార్పులు.. పొడి దగ్గు లేదా నిరంతర దగ్గు.. చర్మంపై అసాధారణమైన మచ్చలు లేదా దద్దుర్లు.

గుండె కవాటాల సమస్యల వల్ల వచ్చే వ్యాధి : అస్తవ్యస్తమైన హృదయ స్పందన.. శ్వాస ఆడకపోవుట.. అలసట.. చీలమండలు లేదా పాదాలలో వాపు ఛాతీలో నొప్పి.. మూర్ఛపోవడం 

ముఖ్యంగా ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవుట, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

ఎంవీ రమణారెడ్డి కన్నుమూత


వైద్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, విప్లవ కమ్యూనిస్టు రచయితగా, రాజకీయ నాయకుడిగా మారిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్. ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) బుధవారం ఉదయం కన్నుమూశారు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డిని కర్నూల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన దేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకు వెళ్లనున్నారు. విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో రచయితగా రమణారెడ్డికి గుర్తింపు ఉంది. నీటి పారుదల రంగం పైనా ఆయన విశ్లేషణలు రాసేవారు. రాయలసీమ విమోచన సమితిని కూడా ఆయన స్థాపించారు. తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టుంది. వ్యాకరణంపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణారెడ్డి ప్రస్తుతం వైసీపీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. ''మనిషి కాకిగా బతకడం కంటే.. మనిషి ఓ మనిషిగా బతకాలి. అంటే అతని వల్ల సమాజానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. నేను రచయితను.. కానీ నేను సమాజానికి చేయగలిగిన ప్రయోజనం ఏమిటంటే, నా రచనల ద్వారా సమాజానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం''అని బీబీసీకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో రమణారెడ్డి వివరించారు. భిన్న రంగాల్లో నైపుణ్యం సాధించడంపై ఆయన స్పందిస్తూ.. ''నా జీవితం చాలా మలుపులు తిరిగింది. అవేమీ నేను ముందుగా అనుకొని చేసింది కాదు. డాక్టర్‌ను కావాలని మాత్రమే నేను అనుకున్నాను. వైద్యం నుంచి ట్రేడ్ యూనియన్‌కు మొదటవచ్చాను. నిజానికి నాకు ట్రేడ్ యూనియన్ గురించి తెలియనే తెలియదు.'' 'నేను పేదల డాక్టర్‌గా పనిచేసేవాణ్ని. అప్పుడు నా దగ్గరకు కొంతమంది వర్కర్లు వచ్చేవారు. ఆ వర్కర్లు తమ చిన్న పిల్లలను తీసుకొని వచ్చేవారు. కానీ మందులు కొనడానికి వారి దగ్గర స్థోమత ఉండేదికాదు. దీనికి పరిష్కారంగా నేను ట్రేడ్ యూనియన్‌లోకి అడుగుపెట్టాను.'' ''నేను మొదట ప్రొద్దుటూరులో మాత్రమే సేవలు అందించేవాణ్ని. అయితే, నాకు సాయం చేయాలని రాయలసీమలోని భిన్న ప్రాంతాలకు చెందినవారు వచ్చేవారు. చాలామంది వర్కర్లు వచ్చేవారు. అలా చాలా ప్రాంతాల్లో యూనియన్లు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఆ పని చాలా ఎక్కువ కావడంతో, నా మెడికల్ ప్రాక్టీస్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రాయలసీమలోని పెద్దల అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక యువ సమాఖ్యను స్థాపించాల్సి వచ్చింది''అని ఆయన వివరించారు. 

Tuesday, September 28, 2021

ఆన్‌లైన్ లావాదేవీలు మరింత సులభం


ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీలు మన జీవితంలో భాగంగా మారాయి. ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో మరింతగా ఈ లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అదే టోకెనైజేషన్ పద్ధతి. ఇక జనవరి 2022 నుంచి ఆన్‌లైన్ లావాదేవీ ల్లో పెద్ద మార్పులు వస్తాయి. ఈ విధానం వల్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు  ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయని ఆర్బీఐ చెబుతోంది. మనం ఈ కామర్స్ యాప్‌లు, వెబ్‌సైట్‌లో ఏమైన కొనాలంటే కార్డ్‌ డీటెయిల్స్‌ తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేసినవి సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన సమాచారం ఇతరుల బారిన పడకుండా ఉండేందుకు కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం క్యూఆర్‌ కోడ్  చెల్లింపులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ (రిటైల్ స్టోర్లలో కార్డ్ లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్) లావాదేవీలను నిర్వహించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సెన్సిటివ్ డేటాను నాన్-సెన్సిటివ్​ డేటా  గా మార్చే ప్రక్రియను టోకెన్స్ అంటారు. యూజర్ల క్రెడిట్​ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల డిజిటల్ అకౌంట్​ను.. డిజిటల్ క్రెడెన్షియల్​గా టోకెన్ మార్చేస్తుంది. దీని ద్వారా కస్టమర్ల కార్డు డేటా మర్చంట్ పేమెంట్ సిస్టమ్​లో సేవ్ అయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ టోకెనైజేషన్​పై కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ వినియోగదారుడు కార్డు డేటా సేవ్ చేసుకోవాలనుకుంటే.. ఎడిషన్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పకుండా ఉండాలని వెల్లడించింది. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు మన కార్డ్‌ వివరాలు ఎంటర్ చేస్తాం.. అప్పడు ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్  పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే..కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ లావాదేవీ ప్రారంభించిన ప్రతిసారి యూజర్ల డేటాను షేర్‌ చేసే అవసరం ఉండదు. ఆన్‌లైన్‌ చెల్లింపులు స్పీడుగా చేసుకోవచ్చు. టోకెన్‌తో కార్డ్ నంబర్, సీవీవీ వివరాల్ని షేర్‌ చేసే అవసరం ఉండదు. ఆర్బీఐ త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టోకనైజేషన్‌ వ్యవస్థ సులభతరంగా ఉంది. అయితే ఈ విధానం అమలు, భద్రత ఎంతవరకు సరిగా ఉంటుంది అనేది పూర్తిగా అమల్లోకి వచ్చాక తెలుస్తుంది.

క్షిపణి పరీక్ష విజయవంతం

 

ఒడిశా రాష్ట్రం లోని చండిపూర్  ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్‌'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్‌డీఓ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. "ఆకాశ్ ప్రైమ్ క్షిపణిలో మెరుగైన ఖచ్చితత్త్వం కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఒక అధికారి మీడియాతో పంచుకున్నారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), భారత సైన్యం, భారత వైమానిక దళం, ఇతర వాటాదారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థపై భారత సైన్యం, భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.

టిప్స్ గుర్తుంచుకోండి...!


అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 3న సేల్ ప్రారంభం కానుంది. మరి ఈ సేల్‌లో మీరు ఏవైనా వస్తువులు కొనేవారు, ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే మంచిది.  మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయాలి. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు వెయిట్ చేసి వృథానే. మీరు డైరెక్ట్‌గా సేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయాలి. ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. ఈ డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు. మీరు కొనాలనుకునే వస్తువు ధర ఎంత ఉంటుందో మీకు ఓ ఐడియా ఉండాలి. అంతకన్నా తక్కువకే ఆ వస్తువు లభిస్తే కొనాలి. అంతే తప్ప డిస్కౌంట్స్ చూడకూడదు. మీరు ధరల్ని చాలా కాలంగా ట్రాక్ చేస్తూ ఉంటే సేల్ సమయంలో ఆ వస్తువు దర తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలుస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరల్ని ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే లాభమే. ఫ్లాష్ సేల్స్‌లో లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ వస్తువు కొనాలనుకుంటే ఎక్కువ సేపు వెయిట్ చేయొద్దు. ముందుగానే ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఫ్లాష్ సేల్ సమయంలో ఆర్డర్ చేయాలి. ఇక మీరు కొనాలనుకునే వస్తువు ధర ఏ వెబ్‌సైట్‌లో ఎంత ఉందో చెక్ చేయాలి. కొన్ని ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తాయి. ఇంకొన్ని అమెజాన్‌లో దొరుకుతాయి. కానీ చాలావరకు ప్రొడక్ట్స్ రెండు వెబ్‌సైట్లలో లభిస్తాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలి. ఉదాహరణకు మీరు వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏ బ్రాండ్ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తుందో చూడాలి. మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వస్తువు కొనాలన్నా రేటింగ్స్, రివ్యూస్ ఓసారి చెక్ చేయాలి. రివ్యూస్ చదివితే ఆ ప్రొడక్ట్‌కు ఉన్న నెగిటీవ్ పాయింట్స్ తెలుస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జీవితంలో ఏదో ఓ దశలో అవసరం ఉన్న వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న సూక్తిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

దుబాయ్‌ ఎక్స్‌పో అక్టోబర్‌ 1....!

 

దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభానికి మరో 3 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ ఎక్స్‌పో అక్టోబర్‌ 1 న ప్రారంభమై.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నది. దుబాయ్-అబుదాబి నగరాల మధ్య ఈ ఎక్స్‌పో జరుగనున్నది. ప్రతిరోజూ 60 షోలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో 191 కంట్రీ పెవిలియన్‌లు ఉన్నాయి. అలాగే 200 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లు సిద్ధం చేశారు. ఎక్స్‌పోను సందర్శించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవును మంజూరు చేస్తూ యూఏఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 6 నెలల పాటు కొనసాగే ఈ ఈవెంట్‌కు వచ్చే 1.7 కోట్ల మందికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది.


దుబాయ్‌ ఎక్స్‌పో కారణంగా మార్కెట్‌లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తున్నది. ఈ ఎక్స్‌పోకు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది వస్తారని అంచనా. ఇందులో 1.7 కోట్ల మంది విదేశీయులు ఉంటారని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ అంతా అనుకున్నట్టుగా జరిగితే, యూఏఈకి దాదాపు రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‌లోని హోటల్‌, విమానయానం, ప్రయాణ రంగాలు కుదేలైపోయాయి. ఎంతో నష్టపోయాయి. అయితే, ఈ ఎక్స్‌పో నిర్వహణతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని ఆశిస్తున్నారు. జనవరి నుంచి జూలై వరకు యూఏఈకి 30 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. హోటల్స్, టూరిజం సంస్థలు 2021 తొలి ఆర్నెళ్లలో 80 లక్షల మంది  అతిథులను ఆకర్షించాయి. 2020 ప్రథమార్థంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదలగా ఉన్నది. హోటల్ పరిశ్రమలో ఆదాయ వృద్ధి 31 శాతంగా ఉన్నది. వ్యాపారానికి ఊతమివ్వడానికి పర్యాటకుల కోసం పలు ఏర్పాట్లు చేశారు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ రూ.300 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో మెట్రో స్టేషన్లు, 50 మెట్రో రైళ్ల సేకరణ, 9 ఫ్లై ఓవర్లతో 138 లేన్ కిమీ రోడ్ల నిర్మాణం ఉన్నాయి. 18 స్టేషన్లు, 15,000 టాక్సీలు యూఏఈ నగరాలను కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. సైట్ నిర్మాణంలో 80 శాతం ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నది. రియల్ ఎస్టేట్, విద్య, పర్యాటకం, రవాణా, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అధునాతన సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్

 

తన భార్య, కుటుంబంపై పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు అనుచితమైన కామెంట్స్ చేస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని మండిపడ్డ పోసాని కృష్ణమురళి.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబంపై అనుచితమైన విమర్శలు చేసి తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్రమైన విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పోసాని కృష్ణమురళిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళిపై అభిమానులు దాడి చేసే అవకాశం ఉంటడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనను పోలీసు ఎస్కార్ట్ వాహనంలో ఆయన ఇంటి దగ్గర దించాలని నిర్ణయించారు. అయితే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళికి బుద్ధి చెబుతామని అభిమానులు హెచ్చరిక చేశారు. పవన్ కళ్యాణ్ సైకో కాదు.. పోసాని కృష్ణమురళి పెద్ద సైకో అంటూ నినాదాలు చేశారు. అభిమానులు ప్రెస్ క్లబ్ ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కాబూల్ యూనివర్సిటీలో మహిళలకు నో ఎంట్రీ!


అమెరికా సైన్యం వెను తిరిగిన తర్వాత మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు తమ అణచివేత విధానాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని కాబూల్‌లో మహిళలపై వివక్షా పూరిత నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కాబూల్ మున్సిపాలిటీలో ఉద్యోగాలు చేసే మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ అక్కడి మేయర్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం కాబూల్ యూనివర్సిటీలో తాలిబన్లు నియమించిన ఛాన్సలర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొని వార్తల్లో నిలిచాడు. యూనివర్సిటీలో  పని చేయడానికి, తరగతులకు హాజరవడానికి మహిళలను అనుమతించబోమని వర్సిటీ ఛాన్సలర్ మహమ్మద్ అష్రాఫ్ ఘైరాట్ ప్రకటించారు. ''అందరికీ నిజమైన ఇస్లాం వాతావరణం అందించే వరకూ వారిని అనుమతించబోం'' అని అష్రాఫ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం వర్సిటీలో ప్రో-తాలిబన్ కార్యక్రమం జరిగింది. దీనికి తల నుంచి పాదాల వరకూ పూర్తిగా నల్లని దుస్తులతో కప్పుకొని మహిళలు కూడా హాజరయ్యారు.

అంతుచిక్కని రహస్యం !

 

టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరిపోయింది. ఎంత బరువునైనా, ఎంత పెద్ద వస్తువునైనా ఒక చోటు నుంచి మరోచోటుకి తేలికగా రవాణా చేయొచ్చు. ఈ రోజుల్లో ఇట్లాంటి మామూలే! కానీ ఐదువేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనదే! నాగరికత, సైన్స్‌ అంతగా అభివృద్ధి చెందని ఆనాటి రోజుల్లో దాదాపుగా 23 అడుగుల ఎత్తైన రాళ్లను ఎట్లా రవాణా చేయగలిగేవారో? ఒకదానిపై మరొకటి ఏ విధంగా పేర్చేవారో కనీసం ఊహించగలరా? ఇంగ‍్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్టోన్‌హెంజ్‌ను చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది!! వీటిని బృహత్‌ శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. అరుదైన బ్లూస్టోన్‌ మెటీరియల్‌తో రూపొందించిన అతి పెద్ద మెగాలితిక్‌ రాళ్ల వృత్తాకర సమూహమే ఈ స్టోన్‌హెంజ్‌. ఐతే ఈ భారీ శిలలు అంత ఎత్తు ఏ విధంగా పెరిగాయి ? వీటి నిర్మాణ సమయంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ రాళ్లను ఎలా తీసుకురాగలిగారు? ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఈ అద్భుతమైన కట్టడాన్ని వీక్షించడానికి ప్రతీ యేట ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా టూరిస్టులు వెళ్తుంటారు. 

ప్రొటీన్‌ కబాబ్స్​

 

ఆకుకూరలు తినమన్నా, పాలు తాగమన్నాపిల్లలు వద్దంటే వద్దని అంటారు. అలాంటప్పుడు వాళ్లు ఇష్టపడేలా వండిపెట్టాలి. ' ప్రొటీన్‌ తొందరగా అరగదని, అది బాడీ బిల్డర్స్‌కి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు చాలామంది తల్లులు. కానీ, ప్రొటీన్‌ అందరికీ అవసరమే. ఈ హైప్రొటీన్‌ కబాబ్స్​ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. 

కబాబ్స్​ కోసం కావాల్సినవి:

శనగలు (నానబెట్టినవి), అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలాలు (చాట్‌మసాలా, మిరియాలపొడి, ఇంగువ, ఉప్పు, ధనియాలపొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్‌), కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ, నువ్వులు, నూనె. 

తయారీ: ఒక గిన్నెలో నానబెట్టిన శనగలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, పచ్చిమిర్చి తరుగువేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వులు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేసి కబాబ్స్​లా వత్తాలి. నూనె వేడిచేసి కబాబ్స్​ను ఎర్రగా ఫ్రై చేయాలి.

ఆమె ఒక జీవితోత్సవం

 

✍️ డా. మోహన్ కందా

విశ్రాంత చీఫ్ సెక్రటరీ, ఉమ్మడి ఆం.ప్ర. ప్రభుత్వం

మా కల్పకం అక్క సెప్టెంబరు 25, 2021న తన 88వ ఏట కనుమూసిన విషయాన్ని వార్తగా ఇస్తూ సీతారాం ఏచూరి మాతృమూర్తి మృతి అని శీర్షిక పెట్టాయి చాలా పత్రికలు. సీతారాంకు ప్రస్తుతం జాతీయస్థాయిలో ఉన్న ఖ్యాతిని బట్టి అలా పెట్టి ఉండవచ్చు కానీ అక్క సొంత ప్రతిపత్తి, స్వయంప్రకాశం కలిగిన ధీరమహిళ. అనేక విద్యలలో ఆరితేరిన వ్యక్తి. పలు సంస్థల ద్వారా బహుముఖాలుగా సమాజసేవ చేసి మా అమ్మ కందా పాపాయమ్మగారికి తగిన కూతురనిపించుకుంది.

కందా కల్పకంగా ఉండగా శాస్త్రీయ నృత్యకారిణిగా, ప్రదర్శనలిచ్చి డాన్సర్‌గా అనేక పతకాలు గెలుచుకుంది. ఏచూరి కల్పకంగా మారాక మహిళా ఉద్యమంలో ప్రధాన భూమిక వహించింది. భూటాన్‌లోని ఫుంట్‌షోలింగ్‌లో నివాసముండగా భర్తతో కలిసి ఒక గుడి కట్టించే బాధ్యత తీసుకుంది. వృద్ధాప్య సమస్యలు కొద్దిగా బాధించినా, చివరివరకూ ఆమెలో ఉత్సాహం ఉరకలు వేస్తూనే వుంది. 

పేపర్లు, పుస్తకాలు చదువుతూ, టీవీలో సినిమాలు చూస్తూ, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటూ బంధుమిత్రులతో సంబంధాలతో చురుగ్గా ఉంది. 35ఏళ్ల మనుమడు అశీష్ (సీతారాం కుమారుడు) అకాల మరణం మానసికంగా కుంగదీయకుండా ఉంటే ఇంకా కొంతకాలం జీవించేదనే నా నమ్మకం. 

నేను పుట్టేనాటికి తనకు పన్నెండేళ్లు. మా ఇద్దరికీ మధ్య ఎవరూ లేరు. మా అమ్మకు అనేక గర్భస్రావాలు జరిగాయి. నేను కూడా ఏడో నెలలోనే అర్భకంగా పుట్టాను. అమ్మతో పాటు తను కూడా నన్నెంతో శ్రద్ధగా పెంచిందని చెప్పాలి. నిజం చెప్పాలంటే తను నాకు రెండో అమ్మ. నన్ను ఎప్పుడూ వెంటే తిప్పుకునేది. అక్క పట్ల ఆరాధనాభావంతో నేను తన చుట్టూనే తిరిగేవాణ్ని. 

మా బావగారు ఏచూరి సర్వేశ్వర సోమయాజులు గారు ఆటోమొబైల్ ఇంజనీరింగు చదివి, ఎపిఎస్ ఆర్టీసిలోను, కేంద్రప్రభుత్వంలోను వివిధ నగరాల్లో ఉన్నతోద్యోగాలు చేశారు. యునైటెడ్ నేషన్స్ తరఫున విదేశాల్లో పనిచేసి, తర్వాత ఢిల్లీ వచ్చి 1999లో చనిపోయారు. చాలా మంచి మనిషి. పెళ్లయ్యాక కూడా అక్కను చదువుకోమని, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనమని ప్రోత్సహించారు.

వివాహితగానే అక్క బెనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేసింది. 1960లలో ఉస్మానియా యూనివర్శిటీలో ఇండియా అండ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సబ్జక్టులో ఎంఫిల్ చేసింది. సరిగ్గా నేనప్పుడే ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ మాథ్స్ చేస్తున్నాను. 

నేను ఐఏఎస్‌కి ప్రిపేరయ్యేటప్పుడు పొలిటికల్ సైన్స్‌లో కోచింగ్ కోసం ఒక ప్రొఫెసర్‌ను ఏర్పాటు చేసింది. నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లినపుడు అక్కాబావా దగ్గరే ఉన్నాను. వాళ్లు నాకు అమ్మానాన్నల్లాటి వాళ్లే. వాళ్లకి పెళ్లయిన నాలుగేళ్లకు సీతారాం పుట్టాడు. యూనివర్శిటీ చదువు తర్వాత అతడు రాజకీయాల్లోకి వెళ్లాడు. తర్వాతివాడు భీమశంకర్. మారుతి కార్పోరేషన్‌లో పనిచేసి రిటైరయ్యాడు. 

రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నపుడే అక్క ఆలిండియా విమెన్ కాన్ఫరెన్స్ కోసం పనిచేసింది. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళాసభలో చురుకైన పాత్ర వహించింది. రెండు నెలల క్రితమే తనకు కాకినాడలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు ఫర్ విమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు ఇచ్చారు. 

కాకినాడ వికలాంగ బాలికల పాఠశాల, బాలభవన్‌ లకు కన్వీనరుగా ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్రమహిళా మండలి అక్షరాస్యతా ఉద్యమంలో సభ్యురాలిగా, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా, రాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీలోను, ఆంధ్ర వనితామండలిలోనూ కోశాధికారిగా ఇలా అనేక సంస్థల్లో వేర్వేరు హోదాల్లో పనిచేసింది. 

వాతావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి గ్లాస్గో, బ్రిటన్, డర్బన్, ఫ్లోరెన్స్, ఇటలీ, మలేసియాలు వెళ్లింది. అఖిల భారత మహిళా మోటర్ ర్యాలీలో గిరి మెమోరియల్ అవార్డు అందుకుంది. 

అక్కా బావా భూటాన్‌లో ఉండేటప్పుడే అక్కడ గుడి కట్టించారు. కొంతకాలం పాటు ఉగాండాలోని నైరోబీలో కూడా ఉన్నారు. ఎక్కడికెళ్లినా ఏదో పని కల్పించుకునేది. నేనంటే ఉన్న అభిమానం, ఆప్యాయత మా ఆవిడ (మా మావయ్య కూతురే) పిల్లల మీద, మనుమల మీద కూడా ప్రసరించింది.

నాకూ మా మేనల్లుళ్లకూ కూడా గట్టి బంధం ఉంది. సీతారాం చిన్నప్పుడు మా అమ్మగారింట్లోనే పెరిగాడు. మా కుటుంబాల మధ్య అన్యోన్యత అప్పటికీ, యిప్పటికీ ఒకేలా ఉంది. తన సుదీర్ఘ జీవనయానంలో కూతురిగా, భార్యగా, తల్లిగా, అత్తగారిగా, నానమ్మగా, తాతమ్మగా అన్ని పాత్రల్లో రాణించింది. నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టి చూపించింది కూడా. కుటుంబసభ్యులు భాషాంతర, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నా ఆమోదించింది. మంత్రి దగ్గర నుంచి బంట్రోతు దాకా ఎవరినైనా సరే ఒకేలా పలకరించేది.

పేదవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చేది. ఏ వయసువారితోనైనా సరే ఇట్టే కలిసిపోయేది. హాస్యచతురత అనేది మా కుటుంబంలోనే ఉంది. ఆమె తెలుగు, తమిళం, ఇంగ్లీషు కలిపి లిమరిక్కులు అల్లేది. ఎప్పుడూ గలగలా నవ్వుతూ మాట్లాడేది. తన అనారోగ్యం గురించి పెద్దగా మాట్లాడేది కాదు. 

అనాడీ హిందీ సినిమాలో ఓ పాట ఉంది. కి మర్‌కే భీ కిసీకో యాద్ ఆయేంగే, కిసీకీ ఆంసువోం మేఁ ముస్కురాయేంగే, కహేగా ఫూల్ హర్ కలీ సే బార్ బార్, జీనా ఇసీకా నామ్ హై అని. ఆ పాట అక్కకు సరిగ్గా వర్తిస్తుంది. జీవించడం అంటే ఇదే అని చాటి చెప్పిన అక్క కప్పూ అని ఆప్యాయంగా పిలిచే తన స్నేహితులను, మా బోటి రక్తబంధువులను విడిచి పైలోకాలకు వెళ్లిపోయింది. నాకు తెలుసు, ఈపాటికే అక్కడ దేవుడితో జోకులేస్తూ ఉంటుంది.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి సేకరణ)

ఉత్తర కొరియా చే క్షిపణిని పరీక్ష

 

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష నిర్వహించింది. భవిష్యత్తులో ద.కొరియాతో శాంతి చర్చలు జరుగుతాయని ఉ.కొరియా గత శనివారం ఆశాభావం వ్యక్తంచేసింది. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించడం గమనార్హం.ఈ పరీక్షపై సియోల్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఓ ప్రకటన చేశారు. గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను ఉ.కొరియా భూభాగం నుంచి తూర్పువైపు సముద్రంలోకి ప్రయోగించారని దానిలో వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకొంది. అమెరికా-ద.కొరియా ఇంటెలిజెన్స్‌ అధికారులు దీనిని విశ్లేషిస్తారని పేర్కొన్నారు. జపాన్‌ కూడా ద.కొరియా ప్రకటనను ధ్రువీకరించింది. ఉ.కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెల మొదట్లో ఉ.కొరియా బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. గత శుక్ర, శనివారాల్లో ఉ.కొరియా నియంత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మాట్లాడుతూ నిబంధనలు పూర్తి చేస్తే చర్చలు, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మర్నాడు ఆమె మరోసారి ద.కొరియాపై ప్రకటన చేశారు. పొరుగు దేశం ఉద్రిక్తతలు పెంచే విధానాలను, ద్వంద్వ వైఖరిని ఆపేయాలని ఆమె కోరారు. దీనికి దక్షిణ కొరియా యూనిఫికేషన్‌ మంత్రి స్పందిస్తూ కిమ్‌ యో జోంగ్‌ ప్రకటన అర్థవంతంగానే ఉన్నా.. చర్చలకు ముందే ఇరు దేశాల కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని సూచించారు. దీనికి ఉ.కొరియా స్పందించలేదు. ఈ నేపథ్యంలో నేడు బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష చేసింది.

గుర్రం జాషువా


ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసారు.తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిన‌ందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు.జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవులు,తల్లి మాదిగ,తండ్రి పాస్టర్ గా పనిచేసేవారు. ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారా లతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.అయితే జాషువా ఊరుకొనేవారుకాదు, తిరగబడేవారు.అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టారు.1910లో మేరీని పెళ్ళి చేసుకున్నారు.మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవారు.ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసారు.టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసారు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు.1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసారు. ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివారు.తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగారు.జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించారు.

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవారు.బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు.జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసారు. గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. 1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశారు.చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పారు.ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించారు. 1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.

సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా

1919 - రుక్మిణీ కళ్యాణం

1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం

1924 - కోకిల

1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం

1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత

1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు

1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు

1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం

1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ

1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల

1932 - స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.

1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక,

1934 - ఆంధ్ర భోజుడు

1941 - గబ్బిలము

1945 - కాందిశీకుడు

1946 - తెరచాటు

1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ

1950 - స్వయంవరం

1957 - కొత్తలోకం

1958 - క్రీస్తు చరిత్ర

1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు

1966 - నాగార్జునసాగరం, నా కథ

జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు.తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారు.అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు.ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యారు. జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతున్నది. 2002 లో ఏడవ సంచికగా అస్సామీ కవి నిల్మనీ ఫుఖాన్ కు పురస్కారమివ్వబడింది. తెలుగు అకాడమీ, జాషువా పరిశోధనాకేంద్రం 2012 సెప్టెంబరు 28 న 'జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా'న్ని (రెండు లక్షల నగదు పురస్కారం ) ప్రముఖకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్కి బహూకరించారు. 2013 సెప్టెంబరు 28 న తెలుగు అకాడమీ జాషువా పురస్కారాల సమావేశం


తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనాకేంద్రం కవులకు రచయితలకు మూడు పురస్కారాలు 2013 సెప్టెంబరు 28 న (118 వ జన్మతిథి రోజున) అందజేసింది. ఈ పురస్కారం 2 లక్షల రూపాయాల నగదు, శాలువా, ప్రశంసాపత్రంతో కూడుకున్నది. దాశరథి రంగాచార్యకు జాషువా జీవిత సాఫల్య పురస్కారము, కొలకలూరి స్వరూప రాణికి జాషువా విశిష్ట మహిళా పురస్కారము బహుకరించారు. దళిత సాహిత్యములో విశేష కృషిచేసినందులకు కాలువ మల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారము బహుకరించారు.

షహీద్ భగత్ సింగ్

 


భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు. చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది. భగత్ సింగ్ పంజాబ్‌లోని లాయల్‌‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు పుట్టిన సంధు ఝాట్ కుటుంబీకుడు. భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు. భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలు ఇవి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌లో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. ఆయన పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ మరియు హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు. బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు.బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. 1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ విజయం సాధించాడు. దానితో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని ఆయన పఠించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో విధ్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువజన సంఘం")లో చేరాడు. నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్, ఆయన సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు. కకోరి రైలు దోపిడీ గురించి ఆయనకు అవగాహన ఉందని భావించారు. ఆయన అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు మరియు సరిదిద్దాడు. సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీసిన కారణంగా ఆయన తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.

        ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.

మేరా రంగ్ దే బసంతీ చోలా

ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా

నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

లాలా లజ్‌పత్ రాయ్ మరణం మరియు సాండర్స్ హత్య 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు.దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు. విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది.భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం. ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు8 ఏప్రిల్ 1929న అసెంబ్లీ వసారాలపై సింగ్ మరియు దత్‌లు బాంబు విసిరి, "ఇంక్విలాబ్ జిందాబాద్!భగత్ సింగ్ రిమంబర్డ్ - డైలీ టైమ్స్ పాకిస్తాన్దీ-ని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు.భగత్ సింగ్ రచనలు] కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత'బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూర బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు. 12 జూన్ 1929న సింగ్ మరియు దత్‌ 'జీవితకాల దేశ బహిష్కరణ'కు గురయ్యారు. సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో  సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు. విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు. ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు. 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది. కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. 

Monday, September 27, 2021

అయస్కాంత తుఫాను భూమిని తాకనుందా?

 


సెప్టెంబర్ 27, 2021న అంటే ఈ రోజు భూ మ్యాగ్నటిక్ తుఫాను భూమిని తాకబోతోందని, ఇది ఉపగ్రహాలు మరియు విద్యుత్ గ్రిడ్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికన్ స్పేస్ వెథర్ ట్రాకింగ్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. ఈ తుఫాను భూ అయస్కాంత తుఫాను సౌర తుఫానుకు భిన్నంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ తుఫానును నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)కు చెందిన అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం (SWPC) సెప్టెంబర్ 27న భూమికి G1 లేదా G2- స్థాయి తుఫాను సంభవించే అవకాశం గురించి SWPC హెచ్చరించింది. ఇక SWPC అంచనా ప్రకారం.. భూ అయస్కాంత తుఫాను యొక్క ప్రభావం ప్రధానంగా 60 డిగ్రీల జియోమాగ్నెటిక్  అక్షాంశం ధ్రువంగా ఉంటుందన్న  అంచనా  వేస్తోంది. అంతే కాకుండా ఇది పవర్ గ్రిడ్ హెచ్చు తగ్గులకు కారణమవుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ తుఫాను కారణంగా ఉపగ్రహాలు బాగా ప్రభావితం అవ్వవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఏం జరగొచ్చు..

భూ అయస్కాంత తుఫాను అనేది భూమి యొక్క మాగ్నెటోస్పియర్‌కు భంగం కలిగిస్తుందని అలాగే సౌర గాలి నుంచి భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి శక్తి మార్పిడి తర్వాత జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఈ పరిస్థితుల వల్ల ఏర్పడే అతి పెద్ద తుఫానులు సౌర కరోనల్ మాస్ ఎజెక్షన్‌లతో (CME లు) సంబంధం కలిగి ఉన్నాయని SWPC తెలిపింది. SWPC ప్రకారం, భూ అయస్కాంత తుఫాను యొక్క ప్రభావం ప్రధానంగా 60 డిగ్రీల జియోమాగ్నెటిక్ అక్షాంశం ధ్రువంగా ఉంటుంది. అలాగే ఇది పవర్ గ్రిడ్ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.ఇక అంతేగాక ఉపగ్రహాలను కూడా బాగా ప్రభావితం చేయవచ్చని SWPC తెలిపింది. అంతే కాకుండా అరోరా భూ అయస్కాంత తుఫాను వలన సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తుఫానులో G1 లేదా G2 రకం తుఫాను ఏదైనా సంభవించే అవకాశం ఉందన్ని సంస్థ భావిస్తోంది. G1 ఇంకా G2 మైనర్ అలాగే మోడరేట్ స్థాయి తుఫానులు. ఎంతో కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఒక G2 స్థాయి తుఫాను అధిక-అక్షాంశ విద్యుత్ వ్యవస్థలలో వోల్టేజ్ అలారాలు ఇంకా ట్రాన్స్‌ఫార్మర్ ని దెబ్బతీసే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ముఖ్యంగా, G1 స్థాయి తుఫాను ఉపగ్రహ కార్యకలాపాలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది. సంస్థ ప్రకటించిన నివేదికల ప్రకారం ఐసోలేటెడ్ జి 1 (మైనర్) జియోమాగ్నెటిక్ స్ట్రోమింగ్ సెప్టెంబర్ 27 న జరిగే అవకాశం ఉంది.

నో కాస్ట్ ఈఎంఐ వెనక ఉన్న మతలబేంటి ?


దసరా, దీపావళి సీజన్ వచ్చేసింది. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవారమే ప్రారంభం కానుంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లాంటి ప్రొడక్ట్స్ కొంటున్నారా? డబ్బులు లేకపోయినా ఇవన్నీ కొనే అవకాశం కల్పిస్తున్నాయి ఇ-కామర్స్ సంస్థలు. నో-కాస్ట్ ఈఎంఐ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌ని నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. డబ్బులు లేకపోయినా ఏం కావాలన్నా కొనే ఛాన్స్ రావడంతో కస్టమర్లు ఎగిరిగంతేస్తున్నారు. అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటీ? రెగ్యులర్ ఈఎంఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎంఐలో ఉన్న తేడాలేంటీ? అన్న అనుమానాలు కస్టమర్లకు ఉండటం మామూలే. రెగ్యులర్ ఈఎంఐలో వస్తువు ధరతో పాటు వడ్డీ కూడా ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.11,000 విలువైన వస్తువు కొంటే రూ.1,000 వడ్డీ అవుతుందనుకుందాం. మొత్తం రూ.12,000 చెల్లించాలి. 6 నెలలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. అదే నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ధర ఎంతో అంతే మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే చాలు. అంటే మీరు రూ.20,000 స్మార్ట్‌ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే అంతే మొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లిస్తే చాలు. అయితే ఇక్కడే ఓ మతలబు ఉంది. తాము వడ్డీ చెల్లించట్లేదు అసలు మాత్రమే చెల్లిస్తున్నానని కస్టమర్లు అనుకుంటారు కానీ, వడ్డీతో పాటు ఇతర ఛార్జీలను కూడా చెల్లిస్తుంటారు. కొన్ని ప్రొడక్ట్స్‌కి కస్టమర్లు అప్పుడే పేమెంట్ చేస్తే భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేప్పుడు బ్యాంకు కార్డులతో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఈఎంఐ ద్వారా కొంటే ఈ డిస్కౌంట్ ఆఫర్స్ వర్తించవు. కాబట్టి ఆమేరకు డిస్కౌంట్ కోల్పోయినట్టే. అంటే మీరు పేమెంట్ చేస్తే వచ్చే డిస్కౌంట్‌ను మీరు ముందే చెల్లిస్తారు కాబట్టి వస్తువు అమ్మినవారితో పాటు బ్యాంకుకు కూడా లాభమే. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటారు కాబట్టి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కస్టమర్ కూడా లాభపడతారు. చేతిలో డబ్బులు లేకపోయినా, అవసరమైన వస్తువులు కొనేందుకు నో కాస్ట్ ఈఎంఐ కస్టమర్లకు ఓ మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే నో కాస్ట్ ఈఎంఐలకు డిమాండ్ పెరుగుతోంది.

తక్కువ ధరలో మార్క్యూ ఎం3 స్మార్ట్' ఫోన్

 

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో Redmi, Realme బ్రాండ్లు ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీ ఇవ్వడానికి మరో కంపెనీ సిద్దమైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్క్యూ కంపెనీ ‘మార్క్యూ ఎం3 స్మార్ట్’ని విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు మార్క్యూ కంపెనీ స్మార్ట్ టీవీలు, స్పీకర్లను విడుదల చేసింది. మార్క్యూ M3 స్మార్ట్ ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలు, రివర్స్ ఛార్జింగ్ టెక్ వంటి ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి. 2GB RAM, 32 GB స్టోరేజ్‌ అందిస్తుంది. వెనుక ప్యానెల్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. ఫింగర్ ప్రింట్‌ సౌకర్యం ఇందులో లేదు. 6.088 అంగుళాల డిస్‌ప్లే, రిజల్యూషన్ 720 ×1,560 పిక్సెల్‌లు, స్క్రీన్ రక్షణ కోసం 2.5D క్వార్డ్‌గ్లాస్1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, బొకే లెన్స్ కలిగి ఉంది. ఇది నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రెంట్‌ కెమెరా ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 9 గంటల పాటు సినిమాను నిరంతరం చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. మార్క్యూ M3 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో దీనిని రూ .6299 కి విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A, ఐటెల్ A26, రియల్‌మే C11 2021, పోకో C3, మైక్రోమాక్స్ ఇన్ 2b వంటి ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనుంది.

గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యంహైదరాబాద్‌ లో మణికొండ నాలాలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యమైంది. గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్‌ చెరువులో మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి వర్షం కారణంగా మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద గోపిశెట్టి రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన విషయం తెలిసిందే. కాగా.. గల్లంతైన వ్యక్తి షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. యువకుడి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నగరంలోని మణికొండ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం లభ్యమైన ప్రదేశానికి అధికారులు చేరుకున్నారు.

చెవిటి, మూగవారితో ఈజీ కమ్యూనికేషన్‌కు 'వేవ్‌చాట్'


షాదన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(హైదరాబాద్)కి చెందిన ముగ్గురు విద్యార్థినులు.. చెవిటి, మూగవారికి ఈజీగా కమ్యూనికేట్ చేసేందుకు వీలుగా 'వేవ్ చాట్' అనే యాప్ తీసుకొచ్చారు. మనం మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేస్తూ వాటిని వీడియో లేదా ఎమోటికాన్‌ల రూపంలో సంకేత సంజ్ఞలుగా ఉత్పత్తి చేస్తుంది. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ 'అనువాదం' జరుగుతుంది. అంతేకాదు ఒకరు క్రమం తప్పకుండా ఉపయోగించే పదబంధాలు లేదా ప్రశ్నల టెంప్లేట్‌లను సేవ్ చేయవచ్చు. మొత్తం సంభాషణను కూడా యాప్‌లో సేవ్ చేసుకునే అవకాశముంది. మానసిక ఆరోగ్య చికిత్సకులు, మనస్తత్వవేత్తలు, సంకేత భాషా నిపుణులతో యాప్ గురించి సుదీర్ఘంగా చర్చించిన నిర్వాహకులు అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు మాదాపూర్‌లోని 'ఎకోస్ లివింగ్ కేఫ్‌'లో డెఫ్ అండ్ స్పీచ్ ఇంపెయిర్డ్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు పలుమార్లు అక్కడికి వెళ్లి సునిశితంగా గమనించారు. అన్ని ఇన్‌పుట్స్ తీసుకుని వైకల్యమున్న వారికి నచ్చేలా దీన్ని అభివృద్ధి చేశారు.

Popular Posts