ఐఫోన్ 13 రిలీజ్‌తో ధర తగ్గిన ఐఫోన్ 12
Your Responsive Ads code (Google Ads)

ఐఫోన్ 13 రిలీజ్‌తో ధర తగ్గిన ఐఫోన్ 12


యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. గతేడాది ఐఫోన్ 12 సిరీస్ రిలీజ్ అయిన ధరలకే ఐఫోన్ 13 సిరీస్ లాంఛ్ చేయడం విశేషం. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 7, ఐప్యాడ్ మినీ లాంఛ్ అయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కావడంతో ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది యాపిల్. ఐఫోన్ 12 ధర ఏకంగా రూ.14,000 తగ్గింది. 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.79,900 కాగా, ప్రస్తుతం రూ.65,900 ధరకే లభిస్తోంది. ఇక 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.84,900 కాగా, ప్రస్తుత ధర రూ.70,900. ఇక హైఎండ్ వేరియంట్ వేరియంట్ 256జీబీ అసలు ధర రూ.94,900 కాగా ప్రస్తుత ధర రూ.80,900. ఇక ఐఫోన్ 12 మినీ ధర రూ.10,000 తగ్గింది. గతంలో రూ.69,900 ఉంటే ప్రస్తుతం రూ.59,900 ధరకే లభిస్తోంది. మరోవైపు ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ నుంచి తొలగించింది కంపెనీ. ఐఫోన్ 12 ప్రో 128జీబీ మోడల్ రూ.1,15,900 ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఐఫోన్ 13 సిరీస్ ధరల్ని చూస్తే ఐఫోన్ 13 మినీ 128జీబీ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.79,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.99,900. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,09,900. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,19,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,29,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,49,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,69,900. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,29,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,39,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,59,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,79,900.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog