Header Ads Widget

అక్టోబర్‌ 4 నుంచి అమెజాన్‌ పండగ సేల్‌ !

 

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు తెర తీసింది . ఏటా 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌' పేరిట నిర్వహించే సేల్‌ అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీలు వంటి వాటిపై అమెజాన్‌ ఆఫర్లు అందిస్తోంది. అమెజాన్‌ ఎకో, ఫైర్‌ స్టిక్‌, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్‌, ఆసుస్‌, ఫాజిల్‌, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు సైతం క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆఫర్లను అమెజాన్‌ అందిస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే డెలివరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. 

Post a Comment

0 Comments