ఒప్పో A54, F19 ల ధరలు పెరిగాయి

 


భారతదేశంలో ఒప్పో బ్రాండ్ కొత్తగా ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సాధారణంగా కొత్త ఫోన్‌ను విడుదల చేసినప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించే ఈ బ్రాండ్ ఈ సారి దీనికి విరుద్ధంగా ఒప్పో A54 మరియు ఒప్పో F19 ధరల మీద రూ.1,000 పెంచింది. ఒప్పో సంస్థ యొక్క ప్రత్యర్థులు రియల్‌మి మరియు షియోమి సంస్థలు దేశంలోని తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచిన కొద్ది రోజుల తర్వాత ఈ తాజా సవరణను అమలుచేసాయి. Oppo A54 మరియు Oppo F19 రెండూ కూడా ఏప్రిల్‌లో భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా మరియు హోల్-పంచ్ డిస్‌ప్లేలతో వస్తాయి. Oppo F19 ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే మరియు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మరోవైపు ఒప్పో A54 HD+ LCD ప్యానెల్ మరియు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్‌తో వస్తుంది. 

Post a Comment

0 Comments