Ad Code

ఆధార్-పాన్ కార్డు లింకేజీ గడువు పెంపు

 


డీ మ్యాట్ సహా బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఆధార్-పాన్ కార్డుల లింక్‌ను కలిగి ఉండాలంటూ రిజర్వుబ్యాంక్ చాలాకాలం కిందటే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద కొంత వ్యతిరేకత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఖాతాదారులకు కొంత వెసలుబాటు కల్పించింది. కొత్తగా ఈ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఇదివరకు ఆధార్‌ కార్డుతో పాన్‌తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉండేది. దీన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింకేజీ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం.. బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవ దలిచిన వారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్..జిరాక్స్ ప్రతులను అందించితే సరిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu