బీపీ ఉన్నవారు తీసుకోకుడనవి... !
Your Responsive Ads code (Google Ads)

బీపీ ఉన్నవారు తీసుకోకుడనవి... !

 


ఈ మధ్యకాలంలో చాలా మందిలో హైబీపీ వస్తోంది. హైబీపీ ఉన్నవాళ్లు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ సలహా తీసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. టాబ్లెట్లను వాడటం తో పాటు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 

కాఫీ: కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. హైబీపీ తో బాధపడే వాళ్ళు కాఫీ తీసుకోకపోతే మంచిది. కాఫీ త్వరగా బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది కాబట్టి కాఫీ ని వీలైనంతవరకు దూరం పెడితే మంచిది.

ఎక్కువ ఉప్పు: ఉప్పుని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. సాల్ట్ కి బదులుగా సైంధవలవణం వాడితే మంచిది. అదే విధంగా హైబీపీ తో బాధపడే వాళ్ళు పండ్లు మీద సలాడ్స్ మీద సాల్ట్ వేసుకోవడం పూర్తిగా మానేస్తే మంచిది.

పంచదార: పంచదార బీపీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపదు. బాగా బరువు ఉన్న వాళ్ళు పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వచ్చి హై బ్లడ్ ప్రెషర్ సమస్యలను తీసుకువస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి.

బ్రెడ్ :హైబీపీ తో బాధపడే వాళ్ళు బ్రెడ్ కూడా తినకుండా ఉంటే మంచిది. పిండి మరియు బటర్ కలిపి బ్రెడ్ ని తయారు చేస్తారు కనుక బీపీ తో బాధపడే వాళ్ళు దానికి దూరంగా ఉంటే బెస్ట్.

ప్రాసెస్డ్ మీట్: దీనిలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక తీసుకోవద్దు. అదే విధంగా ఎక్కువ ఉప్పు సాస్, చెట్నీ, పచ్చళ్ళు వంటి వాటిలో ఉంటుంది కాబట్టి వాటిని కూడా తగ్గిస్తే మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog