Ad Code

ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తల అద్భుతం


వర్షపు నీటి చుక్కల నుంచి విద్యుత్తు తయారు చేసే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ శాస్త్రవేత్తలు. తాజా పరిశోధనలో "లిక్విడ్-సాలిడ్ ఇంటర్‌ఫేస్ ట్రిబోఎలక్ట్రిక్‌ నానోజెనరేటర్" అనే పరికరాన్ని వారు అభివృద్ధి చేశారు. ఈ పరికరం ట్రిబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్​ సిస్టమ్‌లో నీటి చుక్కలు, వర్షపు చుక్కలు, నీటి ప్రవాహాలు, మహాసముద్రం నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని పేర్కొన్నారు. ఈ పరికరాన్ని చాలా తక్కువ సమయంలోనే, తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నానో కాంపొజిట్ పాలిమర్లు, కాంటాక్ట్ ఎలక్ట్రోడ్ల సహాయంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పరికరానికి కొన్ని మిల్లీ వాట్స్​ (mw) శక్తిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో వాచ్‌లు, డిజిటల్ థర్మామీటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిటర్లు, హెల్త్‌కేర్ సెన్సార్లు, పెడోమీటర్లు వంటి తక్కువ కెపాసిటీ గల విద్యుత్ పరికరాలను రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపారు. పైజోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్​తో పోలిస్తే దీని ద్వారానే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని, దీనికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu