Ad Code

బ్లాక్‌ రైస్‌లో పోషకాలు మెండు

 

పోషకాలు మెండుగా ఉండే  రకాలను చూసి ఉంటాం. కాని బ్లాక్‌ రైస్‌ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారని ప్రతీతి. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. సాధారణ వరి కంటే బ్లాక్‌ రైస్‌ దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంది. సాధారణ రకం ధాన్యం ఎకరాకు 25-30 బస్తాల దిగుబడి వస్తే బ్లాక్‌ రైస్‌ 10-15 బస్తాలు మాత్రమే వస్తుంది. సాధారణ రకం బియ్యం కిలో రూ.45-50 ఉంటే... బ్లాక్‌ రైస్‌ కిలో రూ.170 నుంచి రూ.180కి విక్రయిస్తున్నారు. బ్లాక్‌ రైస్‌ సాగుకు పెట్టుబడి తక్కువ అవుతుంది. సాధారణ రకం వరి సాగుకు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతుండగా బ్లాక్‌ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. మామూలు వరికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తప్పని సరి. బ్లాక్‌రైస్‌కు గో ఆధారిత జీవామృతం, గోమూత్రం, ఆవుపేడ, సేంద్రియ ఎరువును వినియోగిస్తారు. ఫలితంగా తెగుళ్ల బెడద ఉండదు. పురుగుల ముందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణ వరి 120 నుంచి 130 రోజుల్లో చేతికి వస్తే బ్లాక్‌ రైస్‌ 140 నుంచి 150 రోజుల సమయం పడుతుంది.

ప్రయోజనాలివీ..

► ఈ బియ్యంలో యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయి

► కేరళ రాష్ట్రంలో వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు

► ఈ బియ్యం మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులను నియంత్రిస్తాయి

► శరీరంలోని అవనసర కొవ్వును కరిగిస్తాయి

► కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి

► ఫైబర్‌ కూడా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉంటుంది

► అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు

► నల్లబియ్యంలో యాంథో సైనిన్లూ అధికంగా ఉండి కంటి వ్యాధులను నయం చేస్తాయి 

Post a Comment

0 Comments

Close Menu