Ad Code

పండుగ బొనాంజా !

 

పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) బంపరాఫర్లు ప్రకటించింది. హోమ్​ లోన్లు(Home Loans), కార్​ లోన్లు, గోల్డ్​ లోన్లు(Gold loans), పర్సనల్​ లోన్లపై 45 బిపిఎస్​ పాయింట్ల వడ్డీ రాయితీ అందిస్తామని తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు ఎస్​బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి వడ్డీరేట్లు పరిశీలించవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేస్తూ "కార్​ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్‌పై ఎస్​బీఐ ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చింది. ఎస్​బీఐ యోనో యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ ఆఫర్లు పొందండి. యోనో ఎస్‌బిఐలో అద్భుతమైన ప్రయోజనాలను ఆస్వాదించండి.'' అని పేర్కొంది.

కొత్త ఆఫర్ల ప్రకారం, ఎస్​బీఐలో తీసుకునే కార్​ లోన్​పై ప్రతి లక్షకు సంవత్సరానికి కేవలం రూ.1,530 వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. అదే విధంగా, కేవలం లక్షకు రూ .1,832 వడ్డీ వద్ద పర్సనల్​ లోన్​ అందిస్తామని తెలిపింది. ఇక, కేవలం 7.5 శాతం వడ్డీతో గోల్ట్ లోన్లను అందిస్తామని తెలిపింది. ఎస్​బీఐ పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించడం ఈ నెలలో ఇది రెండోసారి. కేవలం 6.7 శాతం వడ్డీకే హోమ్​లోన్​ మంజూరు చేస్తామని, అన్ని ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేస్తామని పేర్కొంది. అంతకు ముందు రూ .75 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 7.15 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉండేది. ఈ ఆఫర్ ఫలితంగా కస్టమర్‌లకు దాదాపు 45 బిపిఎస్ ఆదా అవుతుంది. ఇది పెద్ద మొత్తంలో సేవింగ్​గా చెప్పవచ్చు. 30 సంవత్సరాల వ్యవధితో రూ .75 లక్షల రుణం తీసుకుంటే రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఆదా, రూ. 75 లక్షల లోన్​పై రూ. 8 లక్షల వరకు ఆదా అవుతుంది. కస్టమర్ల వృత్తితో సంబంధం లేకుండా అందరికీ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని ఎస్‌బీఐ పేర్కొంది. తద్వారా, కేవలం శాలరీ పొందే కస్టమర్లు మాత్రమే కాకుండా ఇతర కస్టమర్లు సైతం తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. సాధారణంగా శాలరైజ్డ్​​ కస్టమర్లతో పోలిస్తే నాన్​ శాలరైజ్డ్​ కస్టమర్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వారికి15 బీపీఎస్​ ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది. ఇప్పుడు ఎస్​బీఐ తీసుకున్న నిర్ణయంతో నాన్​ శాలరైజ్డ్ పర్సన్స్​ కూడా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

ఎస్​బీఐ పండుగ ఆఫర్లు ప్రకటించడంతో మరిన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించే నిర్ణయం తీసుకున్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ సెప్టెంబర్ 10 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం, ఈ బ్యాంక్ తన హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్లపై సంవత్సరానికి 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దేశంలోనే చౌకైన హోమ్​లోన్​ రేటుగా ఎస్​బీఐ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu