డీజిల్‌ ధర పెరిగింది

 

ఇంధన విక్రయ సంస్థలు ఆదివారం డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం. గత 21 రోజులుగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.96.68, దిల్లీలో రూ.89.07, కోల్‌కతాలో రూ.89.07కు చేరింది. చివరిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండూ కలిపి సెప్టెంబరు 5న మారాయి. తర్వాత డీజిల్‌ ధరలను పలుసార్లు పెంచినప్పటికీ.. పెట్రోల్‌ ధరలు మాత్రం మారలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు సెప్టెంబరు 5 నుంచి 6-7 డాలర్లు పెరగడం గమనార్హం. అయినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్‌ ధరల్ని పెంచలేదు.

Post a Comment

0 Comments