Ad Code

సర్జికల్‌ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!


కరోనా వైరస్‌ వ్యాప్తి కొద్దిగా తగ్గడంతో చాలా ప్రాంతాల్లో మాస్కుల వినియోగం తగ్గిపోయింది. మహానగరాల్లో సైతం మాస్కులు ధరించేవారు కనిపించడంలేదు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ మాస్క్‌ కన్నా సర్జికల్‌ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యమని ఓ సర్వేలో తేలింది. ఇప్పటివరకు జరిగిన సర్వేల కన్నా ఎక్కువగా ఈ సర్వేను నిర్వహించి సర్జికల్‌ మాస్క్‌లే సో బెటరూ అని తేల్చారు. కరోనా వ్యాప్తి జరుగకుండా ఉండాలంటే మాస్క్‌ల వినియోగం తప్పనిసరి. అయితే, ఏది వాడాలి? దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి? అనేది ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. అయితే, బంగ్లదేశ్‌కు చెందిన ఓ సర్వేలో మామూలు మాస్క్‌ల కన్నా సర్జికల్‌ మాస్కులే మంచివని, వీటి వాడకంతోనే వ్యాప్తి తగ్గిపోతుందని తేలింది. మాస్క్‌ల పాత్రపై నిరంతరం తలెత్తే ప్రశ్నలకు సమాధానమివ్వడంతోపాటు కరోనాపై పోరాటంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నదని పరిశోధన వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని 600 మారుమూల గ్రామాల్లోని దాదాపు 3,50,000 మందిని పరిశోధనకు ఎంచుకున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలు ఇన్నోవేషన్‌ ఫర్‌ పావర్టీ యాక్షన్‌ అనే పత్రికలో ప్రచురితమైంది. మూడు లేయర్ల పాలిప్రొపలీన్‌తో తయారైన మాస్క్‌ల వాడకం వల్ల 95 శాతం ప్రయోజనాలు కనిపించాయని పరిశోధనలో పేర్కొన్నారు. అలాగే, వృద్ధుల్లో వీటి వల్ల ఎక్కువ ఉపయోగం కనిపించింది. 60 ఏండ్లకు పైబడిన వారిలో 35 శాతం ఫలితం వచ్చింది. సర్జికల్‌ మాస్క్‌లు సాధారణ వస్త్రంతో చేసిన వాటి కన్నా ధరలో తక్కువ. అదేవిధంగా, వేడి. తేమ వాతావరణంలో సర్జికల్‌ మాస్క్‌లను వాడటం చాలా సులువు. వస్త్రంతో చేసినవి ఉతగ్గానే దాని టెంపర్‌ను కోల్పోయి వేలాడేసినట్లుగా తయారవుతున్నాయి. పరిశోధన జరుపుతున్న సమయంలోనే ఇంటింటికి వెళ్లి మరీ సర్జికల్‌ మాస్క్‌లను పరిశోధకులు పంపిణీ చేశారు. వీడియోలు, బ్రోచర్ల ద్వారా మాస్క్‌లు ధరించాలని ప్రజలను విద్యావంతులను చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనం గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పరిశోధకులు ప్రజలకు సూచించారు. వీరి చొరవ కారణంగా కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 9.3 శాతం తగ్గినట్లు కూడా వారు గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu