పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు ఇరాక్‌లోని ఇర్బిల్ అంతర్జాతీయ వినాశ్రయంపై దాడి చేశాయి. కనీసం రెండు డ్రోన్లు వచ్చినట్లు ఖుర్దిస్థాన్ కౌంటర్ టెర్రిజం సర్వీస్ వెల్లడించింది. దాడితో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎయిర్‌పోర్టు వద్ద మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఓ డ్రోన్ పేలుడు తర్వాత ధ్వంసం కాగా.. మరొకదాన్ని భద్రతా బలగాలు కాల్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. డ్రోన్ దాడితో విమానాశ్రయ రాకపోకలకు అవాంతరాలు ఏర్పడినట్లు వచ్చిన వార్తలను ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి లాక్ ఘపురీ ఖండించారు. ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారుల వెల్లడించారు.
0 Comments