Ad Code

టెస్లా సొంత రిటైల్ షోరూమ్స్‌


అమెరికా ఆధారిత ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా భారత మార్కెట్లో నేరుగా కార్ల అమ్మకాలకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టెస్లా పూర్తిస్థాయిలో సొంత రిటైల్ షోరూమ్స్ ఓపెన్ చేసేందుకు రెడీ అయింది. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా టెస్లా చర్చలు జరుపుతోంది. భారత్ లో సొంత రిటైల్ షోరూంలను ఏర్పాటు చేసి.. అందులో నుంచే నేరుగా కార్ల సేల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆటో మొబైల్ రంగంలో అగ్రగామి టెస్లా ఈ ఏడాది ఆఖరిలోగా నాలుగు మోడల్స్ కార్లలో ఒకటైనా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. రాయితీలపై కూడా చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఫిజికల్‌ రిటైల్‌ షోరూమ్స్‌ను సొంతగా నిర్వహించేందుకు టెస్లా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీలర్‌ నెట్‌వర్క్‌ అవసరం లేకుండా నేరుగా సొంత షోరూమ్స్‌ నుంచే కార్ల సేల్స్ చేపట్టనుంది. ఆన్‌లైన్‌లోనూ కార్ల సేల్స్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఆన్‌లైన్‌ సేల్ నడుస్తోంది. ఇప్పటికే జర్మనీతో పాటు మరికొన్ని దేశాల్లోనూ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఆన్‌లైన్‌ సేల్స్‌ విభాగం ద్వారా టెస్లా, భారత్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. విదేశీ కంపెనీలకు FDI రూల్స్‌ను సవరించే అంశం కేంద్రం పరిధిలోనే ఉంటుంది. అందుకే సబ్బీడీలు, ప్రొడక్టులపై స్థానిక ఉత్పత్తులుగా పరిగణించేందుకు అవసరమైన వాటిపై చర్చలు జరుపుతోంది. భారత్‌లో ఐకియా ఫిజికల్‌ షోరూమ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu