Ad Code

నా ప్రయాణం ఆగదు... !

 

బాలీవుడ్ నటుడు, కరోనా సమయంలో సాయానికి వెనుకాడకుండా పేదల పాలిట ఆపద్బాంధవుడుగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ చాలారోజుల తర్వాత స్పందించాడు. సోనూసూద్ ఇంట్లో… ఆయన ఆఫీస్ లలో ఇన్ కంటాక్స్ అధికారుల సోదాల వ్యవహారం ఇటీవల దేశమంతటా చర్చనీయాంశమైంది. సోనూసూద్ తన ఆదాయానికి సంబంధించిన భారీ స్థాయిలో పన్నులు ఎగవేశారని ఐటీ శాఖ నుంచి లీకులు కూడా వచ్చాయి. దీంతో సోనూసూద్ ఆదాయపు పన్నుల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ అయింది. ఐటీ సోదాలు, పోలీసుల చర్యలు, పొలిటికల్ యాక్షన్ ఊహాగానాలను బ్రేక్ చేస్తూ.. సోనూసూద్ ట్విట్టర్ లో స్పందించారు. 'నీ వైపు వెర్షన్ ఏంటో నువ్వు ప్రతిసారీ చెప్పాల్సిన అవసరం లేదు. టైమే నువ్వేంటో చెబుతుంది' అంటూ ట్విట్టర్ లో సోనూసూద్ ఓ లెటర్ పోస్ట్ చేశారు. 'భారత దేశ ప్రజలకు శక్తి వంచన లేకుండా నిండు మనసుతో సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఞ చేసుకున్నా. అవసరంలో ఉన్న వారికి… ప్రాణాలు కాపాడటానికి నా ఫౌండేషన్ కు వచ్చే ప్రతి రూపాయి ఎదురుచూస్తుంది. నాకు ఒప్పందంలో భాగంగా రావాల్సిన డబ్బులను మానవీయ కోణంలో దానం చేయాలని బ్రాండ్లను ఎన్నో సందర్భాల్లో నేను కోరుతూ వస్తున్నా' అని సోనూసూద్ చెప్పారు. కొందరు గెస్టులను కలుస్తూ గడిచిన నాలుగు రోజులుగా ప్రజాసేవకు దూరంగా ఉన్నాననీ… మానవత్వం చాటుతూ సేవ చేసేందుకు తాను మళ్లీ సిద్ధంగా ఉన్నానని సోనూసూద్ చెప్పారు. తన సేవా ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు సోనూసూద్. జైహింద్ అంటూ తన లెటర్‌ను ముగించారు.

Post a Comment

0 Comments

Close Menu