Ad Code

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి !


మున్సిపల్‌ వ్యవస్థపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలని అందుకు తగినట్లు మౌళిక వసతులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేశామని, తాగునీటి సమస్య 90 శాతం పూర్తి చేయడంతోపాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కూడా లేకుండా చేసి అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామ న్నారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీవరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 3,866.21 కోట్లు కేబినెట్ కేటాయించిందని, నగరంలో కొత్తగా 2 లక్షల వాటర్‌ కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. నగరంలో 20 శాతంపైగా నీటిని రీ యూజ్  చేస్తున్నట్లు వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేలు నిర్మించడానికి అనుమతికి 7 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 1200 కోట్లతో 137 ఎంఎల్‌డీ కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మురుగునీటి శుద్ది, తిరిగి ఉపయోగించడానికి కాలుష్య నియంత్రణ బోర్డ్, వాటర్ బోర్డ్తో కలిసి కొత్త పాలసీని తెస్తామని కేటీఆర్‌ అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu