Ad Code

అమెజాన్ ప్రైమ్ లేదా?


ఇండియాలో నెట్ ఫిక్స్‌తో, ఇతర OTT సర్వీసులతో పోలిస్తే ఒకే సబ్స్క్రిప్షన్ ద్వారా సంవత్సరం మొత్తం అనేక ప్రయోజనాలు అందిస్తున్న సంస్థగా అమెజాన్ ప్రైమ్ ని చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 999 రూపాయలు చెల్లిస్తే చాలు, అనేక ప్రయోజనాలు లభిస్తాయి. హైదరాబాద్, బెంగుళూరు, ముంబాయి ఢిల్లీ వంటి నగరాల్లో అమెజాన్ లో ఆర్డర్ పెట్టే వస్తువులను ఒక్క రోజులో, రెండు రోజుల్లో తెప్పించుకోవాలంటే అదనంగా రూ. 100, రూ. 50 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ వున్నవారు సంవత్సరం మొత్తం ఫాస్ట్ డెలివరీ పొందొచ్చు. తెలుగు సినిమాలతో పాటు, భారీ మొత్తంలో ఇతర భాషల సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటికి నెలకు 500, 800 చెల్లించాల్సింది కాస్తా ప్రైమ్ వీడియోలో భారీ కంటెంట్ లభించడం వల్ల చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. Prime subscription తీసుకుంటే ప్రైమ్ వీడియో ఫ్రీ. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలకు చెందిన 75 మిలియన్స్ పాటలు ఉన్న అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఫ్రీగా లభిస్తుంది. గేమింగ్ ఇష్టపడే వారికి కూడా ఉచితంగా in-game content లభిస్తుంది. అమెజాన్ కిండిల్ ఇ-రీడర్ యాప్ ద్వారా అనేక పుస్తకాలు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కలిగినవారికి ఉచితంగా అందించబడతాయి. సంవత్సరం మొత్తం ప్రతీరోజూ అమెజాన్ లో అనేక వస్తువుల మీద భారీ మొత్తంలో డిస్కౌంట్లు కేవలం ప్రైమ్ మెంబర్లకి మాత్రమే లభిస్తుంటాయి. వాటిని యాక్సెస్ చేయొచ్చు.


Post a Comment

0 Comments

Close Menu