Header Ads Widget

రీబోక్ నుంచి న్యూ స్టైల్ రిలీజ్


ప్రముఖ ఫిట్నెస్ బ్రాండ్ రీబాక్ తన వినియోగదారులు అందరికీ ఫిట్‌నెస్ ఎంపికలను అనుసరించే నిబద్ధతకు అనుగుణంగా తన వాకింగ్ ఫుట్‌వేర్ శ్రేణిలో కొత్త స్టైళ్లను విడుదల చేసింది. ఈ విభాగం మహిళలు, పురుషులు ఇద్దరికీ టెక్నికల్ అప్‌గ్రేడ్‌తో సరికొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు రాగా, నడిచే సమయంలో అనుకూలంగా ఉంటాయి. పలు సంవత్సరాల నుంచి వాకింగ్‌ను దేహదారుఢ్యం కాపాడుకునే వ్యాయామంగా అందరూ గుర్తించారు. ఈ పోకడను మరింత ఉత్తేజించేందుకు కొత్తగా వాకింగ్ చేసేందుకు వస్తున్న వారి కోసం రీబాక్ సరికొత్త సేకరణను ఉన్నత నాణ్యత, సౌఖ్యత, సాంకేతికతను అందుబాటు ధరలో అందిస్తోంది. కొత్త ఉత్పత్తుల శ్రేణిలో రీబాక్ డైలీఫిట్ డిఎంఎక్స్, ఎవర్ రోడ్ డిఎంఎక్స్ 4.0, ఎవర్ రోడ్ డిఎంఎక్స్ స్లిప్ ఆన్, వాక్ వే కంఫి 2.0, ధ్రుహాన్ తదితరాలు ఉండగా, వాకింగ్ విభాగంలో ఇవి రీబాక్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

రీబాక్ వాకింగ్ షూల ప్రత్యేకత అయిన డిఎంఎక్స్ మూవింగ్ ఎయిర్ టెక్నాలజీ సహజసిద్ధమైన కుషనింగ్‌ను వెనుక నుంచి వేళ్ల చివరి వరకు మిడ్‌సోల్‌లో గాలి చలనాన్ని ఉత్తేజించి, అనుకూలకరమైన వాకింగ్ అనుభవాన్ని ఇస్తుంది. కొత్త డైలీఫిట్ డిఎంఎక్స్ మెరుగైన, అత్యాధునిక డిఎంఎక్స్ ట్రిపుల్ మ్యాక్స్ ఎయిర్ మూవింగ్ టెక్నాలజీతో రోజంతా అనుకూలతకు అదనపు ఆర్చ్ మద్ధతు ఇస్తుంది. పురస్కారాలను అందుకున్న రీబాక్ డైలీఫిట్ డిఎంఎక్స్ వాకింగ్ షూ విస్తృతమైన కొత్త వర్ణాలను కూడా తీసుకు వస్తోంది. డైలీఫిట్ డిఎంఎక్స్ మహిళలకు విస్తృతమైన, అందుబాటు ధరలో అందిస్తుంది. కొత్త డైలీఫిట్ డిఎంఎక్స్ వర్ణాల్లో తెలుపు/నలుపు/పింక్ టై-డై/ గ్రే వర్ణాలు ఉన్నాయి.

వాకింగ్ శ్రేణి గురించి రీబాక్ బ్రాండ్ రాయబారి కత్రినా కైఫ్ మాట్లాడుతూ ''నాకు రీబాక్‌తో దీర్ఘకాలం నుంచి భాగస్వామ్యం ఉంది. ఇది బ్రాండ్‌కు మరొక బలమైన అభియాన్‌లో భాగం అయ్యేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తన వాకింగ్‌ విభాగంలోని షూలలో తన కొత్త స్టైళ్ల విడుదలను ఫిట్‌నెస్ గురించి రీబాక్ తన నిబద్ధతను చాటి చెబుతూ, నడిచే వ్యాయాయం ఎలా పెద్ద వ్యత్యాసాన్ని తీసుకు వస్తుందో సూచిస్తుంది. వాకింగ్ నిత్యం ఎవరైనా చేయదగిన పనిగా ఉంది. రీబాక్ తన ఉత్పత్తులను అనుకూలకరమైన, నాణ్యత, దీర్ఘకాలిక మన్నికను కాపాడుకుంటూ, ఎక్కువ అందుబాటులో ఉండేలా చేస్తూ, దేశ వ్యాప్తంగా ఎక్కువ సదృఢమైన, ఉత్తమ జీవనశైలి గడిపేందుకు ప్రజలకు ఎక్కువ అవకాశాలను అందిస్తూ ఉత్తేజిస్తుంది'' అని తెలిపారు.

డైలీ ఫిట్ డిఎంఎక్స్- రూ.6,599

ఎవర్ రోడ్ డిఎంఎక్స్ 4.0- రూ.5,999

ఎవర్ రోడ్ డిఎంఎక్స్ స్లిప్ ఆన్ 4-రూ.5,999

వాక్-ఎవే కంఫి 2.0-రూ.4,599 త్వరలో విడుదల కానున్నాయి

ధ్రుహాన్- రూ.3,999 త్వరలో విడుదల కానున్నాయి.

కొత్త వాకింగ్ శ్రేణి ఇప్పుడు పురుషులు అలాగే మహిళలకు shop4reebok.comలో, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇతర ఫ్యాషన్ రిటైలర్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో, మింత్ర టాటా క్లిక్‌లలో కూడా విస్తృత శ్రేణి కొత్త వాకింగ్ స్టైళ్లను చూడవచ్చు. ధ్రుహాస్ సెప్టెంబరు మధ్యలో, వాక్-వే కంఫి 2.0 కొత్త వాకింగ్ శ్రేణి అక్టోబరు మొదటి వారంలో విడుదల కానున్నాయి. 

Post a Comment

0 Comments