ఇతర ISP ల కంటే టాటా స్కై ఎందుకు మెరుగ్గా ఉంది?
0
September 13, 2021
భారతదేశంలో డైరెక్ట్-టు-హోమ్ రంగంలో చాలా పేరున్న బ్రాండ్ లలో టాటా స్కై ఒకటి. భారతదేశం అంతటా శాటిలైట్ టీవీ సేవలను అందించే విషయంలో టాటా స్కై అగ్రస్థానంలో ఉంది. టాటా స్కై తన బ్రాండ్‌ను ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా నిర్మిస్తూ మార్కెట్ ను విస్తరిస్తోంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో తన సేవలను విస్తరించింది. అంతేకాకుండా వీలైనంత వేగంగా మరిన్ని నగరాలలో కూడా తన ఫైబర్ నెట్‌వర్క్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిరంతరం తన యొక్క ప్రయత్నాలను చేస్తోంది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు అందించని కొన్ని ప్రయోజనాలను కంపెనీ తన బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు అందిస్తుంది. టాటా స్కై కంపెనీ తన వినియోగదారుల కోసం ఉచితంగా ఇన్ స్టాలేషన్ మరియు ఫైబర్ కనెక్షన్ యొక్క సెటప్‌ను అందిస్తోంది. దీనిని అగ్రస్థానంలో ఉంచడానికి గల ప్రధాన కారణం టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆధునిక డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌ని ఉచితంగా అందించడం. అది అధిక వేగాన్ని మరింత సౌకర్యవంతంగా అందిస్తుంది. టాటా స్కై యొక్క వెబ్‌సైట్‌లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు సూపర్-ఫాస్ట్ స్పీడ్ మరియు 99.9%అప్‌టైమ్‌తో Wi-Fi నెట్‌వర్క్ లభిస్తుందని వాగ్దానం చేసింది. ఇంకా కంపెనీ వినియోగదారులకు ఏకరీతి వేగాలను వాగ్దానం చేస్తుంది. దీని అర్థం ఒక వినియోగదారుడు కంపెనీ నుండి 300 Mbps ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే వారు 300 Mbps డౌన్‌లోడ్‌తో పాటు అప్‌లోడ్ వేగాన్ని పొందుతారు. సరళంగా చెప్పాలంటే ఏకరీతి వేగం అంటే అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ రెండింటికీ ఒకే వేగం అని అర్థం. చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) ఆశించేది ఇదే.