Ad Code

రూ.10,000 లోపే రియల్‌మీ స్మార్ట్ టీవీ


రియల్‌మీ ఇటీవల స్మార్ట్ టీవీ నియో పేరుతో 32 అంగుళాల స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. రియల్‌మీ స్మార్ట్ టీవీ 32 అంగుళాల టీవీ ధర రూ.14,999 ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 3న సేల్ మొదలవుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ రూ.10,000 లోపే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ టీవీపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. రూ.14,999 విలువైన రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో కేవలం రూ.10,999 ధరకే లభిస్తోంది.  రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో మోడల్‌ను యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.1100 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.9,899 ధరకే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో స్పెసిఫికేషన్స్ చూస్తే 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఇది. క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పిక్చర్ క్వాలిటీ పెంచేందుకు క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఉంది. ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్స్, యూఎస్‌బీ టైప్ ఏ పోర్ట్, ఏవీ పోర్ట్, ల్యాన్ పోర్ట్ ఉన్నాయి. రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో మోడల్‌లో రెండు 10వాట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్, హంగామా, ఎరోస్ నౌ లాంటి యాప్స్ ఉంటాయి. మొబైల్ గేమ్స్ ఆడేందుకు, స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ నుంచి వీడియోస్ స్ట్రీమ్ చేసేందుకు సీసీ క్యాస్ట్ ఫీచర్ కూడా ఉంది. రియల్‌మీ రూ.15,000 లోపు అందిస్తున్న స్మార్ట్ టీవీల్లో ఇది కూడా ఒకటి. రియల్‌మీ స్మార్ట్ టీవీ నియోను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. సోల్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్ టీవీలతో పాటు వన్‌ప్లస్, షావోమీ, సాంసంగ్ లాంటి బ్రాండ్స్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అన్ని టీవీలపై యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu