Header Ads Widget

రెడ్‌ మీ నోట్‌11 సిరీస్‌ ఫోన్‌

 

స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ రెడ్‌ మీ నోట్‌11 సిరీస్‌ ఫోన్‌ల ను విడుదల చేయనుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా రెడ్‌ మీ నోట్‌ 11 సిరీస్‌ ఫోన్లను తొలిసారి చైనాలో రిలీజ్‌ చేసి ఆ తర్వాత ఇండియాలో మార్చి నాటికి (అంచనా) విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రెడ్‌ మీ నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లు లీకయ్యాయి. ఆ లీకైన ఫోన్‌ ఫీచర్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ సినా వీబో వివరాల ప్రకారం..5జీ రెడ్ మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్‌, మెరుగైన ఫీచర్లు, సూపర్‌ పవర్ ఎఫిషెన్సీ  కోసం మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 920 ఎస్‌ఓఎస్‌, 67డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌ 256జీబీ ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌, 120 హెచ్‌డి ఆమ్లోడ్‌ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ప్రోరియెంట్ లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, క్వాడ్‌ కెమెరా సెటప్‌, 16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా సెన్సార్‌ ఫీచర్లు ఉన్నట్లు టెక్‌ బ్లాగ్‌ సినావిబో పేర్కొంది. రెడ్‌ మీ నోట్‌ 11ప్రో 5జీ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌ 128జీబీ ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ ధర చైనాలో ఇండియన్‌ కరెన్సీ ప్రకారం. రూ.18,600గా ఉంది. అదే 8జీబీ ర్యామ్‌ ఆప్షన్‌ తో 128జీబీ అండ్‌ 256జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధరలు రూ.21,000, నుంచి రూ.23,300 మధ్యలో లభించనుంది.


Post a Comment

0 Comments