Ad Code

ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..!


జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ టయోటా హైడ్రోజన్‌తో నడిచే వాహనాన్ని' మిరై' రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వాహనం ఇంధనం నింపకుండా అత్యధిక దూరం ప్రయాణించినందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. హైడ్రోజన్ శక్తితో నడిచే మిరై 1360 కిమీ మేర ప్రయాణించింది. 2021 టయోటా మిరై కార్‌ను ప్రొఫెషనల్ డ్రైవర్‌ హైపర్‌మిలర్ నడిపారు. వేన్ గెర్డెస్, బాబ్ వింగర్ అతనికి సహ-పైలట్‌ డ్రైవర్లుగా ఉన్నారు.టయోటా మిరై 5.65 కేజీల హైడ్రోజన్‌ను మాత్రమే వాడినట్లు టయోటా పేర్కొంది. టయోటా మిరై ఫస్ట్‌జనరేషన్‌ కారును 2016లో రూపొందించగా దాని తరువాత జనరేషన్‌ మిరై అత్యధిక దూరం ప్రయాణించి రికార్డులను నమోదుచేసింది. ఫ్యుయెల్‌ సెల్ ఎలక్ట్రిక్ వాహనం ( ఎఫ్‌సీఈవీ ) ఒక ఎలక్ట్రిక్ వాహనం దీనిలో ఇంధనంగా ఫ్యుయెల్‌ సెల్‌ , చిన్న బ్యాటరీ లేదా సూపర్‌ కెపాసిటర్లను ఉపయోగిస్తారు. ఎఫ్‌సీఈవీ వాహానాల్లో సాధారణంగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించి సంపీడన హైడ్రోజన్‌ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. చాలా ఫుయెల్‌ సెల్‌ వాహనాలు నీరు, వేడిని మాత్రమే ఉద్గారాలుగా వెలువడుతాయి. 

Post a Comment

0 Comments

Close Menu