Header Ads Widget

16సైకీ భూమికిచేరితే ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!

 

అనంతమైన విశ్వం పుట్టుక మీద, ఇతర గ్రహాలపై మానవ మనుగడ మీద వందలు, వేల కోట్లు ఖర్చుపెట్టి పరిశోధనలు చేస్తోంది నాసా. అయితే తాజాగా నాసా కన్ను ఓ ఆస్ట్రాయిడ్ మీద పడింది. ఉల్క అంటే అదేదో రివ్వున దూసుకొచ్చి, భూమ్మీద పడిపోయేది కాదు. వేగంగా దూసుకొచ్చి భూమిని బద్దలు చేసేది అంతకన్నాకాదు. దాని వల్ల నష్టంలేదు. పైగా లాభం ఉంది. అదే '16సైకీ' ఉల్క. వినేందుకు కాస్త వింతగా ఉన్నా.. దీనిపైనే నాసా ప్రస్తుతం పరిశోధనలు చేస్తోంది. అంగారక గ్రహం, గురు గ్రహం మధ్యలో ఉన్న ఈ ఉల్క. భూమికి 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందట. అలాగే 140 మైళ్ల వ్యాసంతో దీని సైజు ఉందట. అయితే నాసా ఇంతకాలం చేసిన పరిశోధనలు వేరు, ఈ పరిశోధన వేరు. ఎందుకంటే ఇంతకాలం ఇతర గ్రహాలపై నీళ్లు, రాళ్లు అంటూ సాగిన పరిశోధనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నాసా తొలిసారిగా లోహాల కోసం పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ పరిశోదనల్లో '16 సైకీ' అనే ఆస్ట్రాయిడ్‌ విచిత్రంగా, విలువైనదిగా కనిపించింది. నాసా పరిశోధిస్తున్న '16 సైకీ' అనే ఆస్ట్రాయిడ్‌లో లోహాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ ఉల్కలోని లోహాల విలువ ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోతారంటున్నారు. ఈ లోహాల విలువ 10వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు. సింపుల్‌గా చెప్పాలంటే భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పంచితే కనీసం ఏడువేల కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. భూమండలంలో అనేకానేక పనులకు కావల్సిన లోహాలు లక్షల ఏళ్లపాటు వాడుకోవలసినంత '16 సైకీ'లో ఉన్నట్లు చెబుతున్నారు సైంటిస్టులు. ఈ ఆస్ట్రాయిడ్‌ మీద నికెల్‌, ఉక్కు నిల్వలు 17 మిలియన్‌ బిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని బెర్న్‌స్టీన్‌ అనే రీసెర్చ్‌ సంస్థ లెక్కలు గట్టింది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Post a Comment

0 Comments