ఆసియాలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ఇండియాజాయ్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. నవంబర్ 16 నుంచి 19 వరకు వర్చువల్‌గా ఇది జరుగనున్నది. ఎస్‌స్పోర్ట్స్, స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫాం మొబైల్ ప్రీమియర్ లీగ్, ఇండియాజాయ్ 2021కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ వార్షిక ఈవెంట్‌ను తెలంగాణ వర్చువల్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నది. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్.. వ్యాపారాలు, వ్యాపార నాయకులు, కంటెంట్ సృష్టికర్తలు, గేమింగ్, యానిమేషన్, డిజిటల్ మీడియా, వినోద రంగాలలోని నిపుణులను ఒకచోట చేర్చుతుంది. VFX, OTT పల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, దేశిటూన్స్ వంటివి ఇందులో మిళితమై ఉంటాయి.
0 Comments