నాలుగు రోజుల్లోరూ.20 వేల కోట్ల వ్యాపారందసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్‌ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్‌ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్లను భారీగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఆయా ఈ కామర్స్‌ సంస్థలు ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించడంతో కొనుగోలుదారులు ఎగబడి కొంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లో సుమారు 2.7 బిలియన్‌ డాలర్ల(రూ. 20250 కోట్లు) అమ్మకాలను ఈ-కామర్స్‌ సంస్థలు జరిపినట్లు తెలుస్తోంది. రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం..పలు ఈకామర్స్‌ సంస్థలు అక్టోబర్‌ మొదటి వారంలో సుమారు 2.7 బిలియన్ డాలర్ల అమ్మకాలను జరిపాయని పేర్కొంది. మొదటి నాలుగు రోజుల అమ్మకాలలో 50శాతం మేర స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జరిగాయని రెడ్‌సీర్‌ వెల్లడించింది. అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల్లో మరో 2.1 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ ప్రకటించింది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్స్‌, గృహోపకరణాలు, బ్యూటీ, ఫ్యాషన్‌ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ-కామర్స్‌ సంస్థల ఫెస్టివల్‌ సేల్‌లో కేవలం ఐదు రోజుల్లో సుమారు 20 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్లను, మూడురోజుల్లో సుమారు లక్షకుపైగా స్మార్ట్‌టీవీలను ప్రముఖ చైనీస్‌ దిగ్గజం షావోమీ విక్రయించింది.

Post a Comment

0 Comments