Ad Code

ఉచితంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సిమ్‌ పొందే అవకాశం...!

 1 ​ 2
4జీ సిమ్‌లను ఉచితంగా అందించే ఆఫర్‌ను పొడిగించింది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌). కొత్త కస్టమర్లతో పాటు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేవారికి 4జీ సిమ్‌ను ఉచితంగా అందిస్తోంది. అయితే వీరు కనీసం రూ.100తో ఫస్ట్ రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ కేవలం కేరళలోనే అందుబాటులో ఉంది. త్వరలో ఈ సదుపాయాన్ని దేశంలోని అన్ని టెలికాం సర్కిల్స్‌కు విస్తరిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ అంటోంది. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌ను డిసెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్త 4G సిమ్‌ కోసం రూ.20 వసూలు చేస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. అయితే కొత్త వినియోగదారులు, మొబైల్‌ నెంబర్‌ పోర్టబిలిటీ పెట్టుకున్న వారికి సిమ్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని కోసం ఆ కస్టమర్లు రూ.100/- కంటే ఎక్కువ మొత్తంలో మొదటి రీఛార్జ్ కూపన్‌ (ఎఫ్‌ఆర్‌సీ) పొందాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన కస్టమర్‌ కేర్‌ సెంటర్లు (బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎస్‌సీలు), బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైల్‌ కౌంటర్ల నుంచి 4G సిమ్‌ ఉచితంగా పొందవచ్చు. మరో వైపు 90 రోజుల కోసం ఉన్న రూ.699 ప్లాన్‌ వ్యాలిడిటీని మరో 90 రోజులకు పెంచింది బీఎస్‌ఎన్ఎల్‌. ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ద్వారా ఈ 180 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్‌ పొందవచ్చు. వాస్తవానికి ఈ ప్లాన్‌ గడువు సెప్టెంబర్ 28తో ముగిసింది. దీన్ని ఇప్పుడు మరో 90 రోజులకు పొడిగించారు. అంటే జనవరి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు 0.5 జీజీ డేటా, అపరిమిత కాల్స్‌, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు.. వంటి అదనపు ప్రయోజనాలను ఈ ప్లాన్‌ ద్వారా పొందవచ్చు. 123 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపించి లేదా యూఎస్‌ఎస్‌డీ షార్ట్‌ కోడ్‌ డయల్‌ చేసి.. రిటైల్‌ స్టోర్స్ నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను కస్టమర్లు పొందవచ్చు.బీఎస్‌ఎన్ఎల్‌కు చెందిన ప్రస్తుత, కొత్త ప్రీపెయిడ్‌ కస్టమర్లందరికీ ఈ రూ.699 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. PLAN BSNL699 అనే ఎస్‌ఎంఎస్‌ను 123 నెంబర్‌కు పంపించి బీఎస్‌ఎన్ఎల్‌ కస్టమర్లు ఈ ప్లాన్ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అంతే కాదు దీన్ని యాక్టివేట్‌ చేసుకునేందుకు *444*699# యూఎస్‌ఎస్‌డీ షార్ట్‌ కోడ్‌ డయల్‌ చేసుకోవచ్చు. అయితే ఎస్‌ఎంఎస్‌ పంపించే ముందు లేదా కోడ్‌ డయల్‌ చేయడానికి ముందు ప్రస్తుత ప్రీపెయిడ్‌ కస్టమర్లు తమ ప్రీపెయిడ్‌ అకౌంట్‌ బ్యాలెన్స్ రూ.699 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. P

Post a Comment

0 Comments

Close Menu