Ad Code

5 వేలలోపు బెస్ట్​ ఇయర్​బడ్స్ !


కరోనా తర్వాత టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ మార్కెట్​ గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఇయర్​బడ్స్​ అంటే ఒక్క యాపిల్​ ఇయర్​బడ్స్​ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ యాపిల్​ను తలదన్నేలా బడ్జెట్​ ధరలోనే అనేక స్మార్ట్​బ్రాండ్లు ఇయర్​బడ్స్​ను విడుదల చేస్తున్నాయి.​ వీటి ధర కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో భారీ డిస్కౌంట్లతో వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్​లో రూ. 5 వేలలోపు లభిస్తున్న టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ గురింఛి తెలుసుకోండి. 

జబ్రా ఎలైట్ 65టీ

డానిష్​కు చెందిన హెడ్​ఫోన్​ తయారీ సంస్థ జబ్రా ఎలైట్​ బడ్జెట్​ ధరలోనే TWS ఇయర్‌బడ్స్​ను విక్రయిస్తోంది. ఇవి ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌కు పోటీగా రిలీజయ్యాయి. అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో వీటిని కేవలం రూ .4,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ IP55 వాటర్ రెసిస్టెన్స్‌ కలిగి ఉంటాయి. ఇవి 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఈ ఇయర్​బడ్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తాయి. క్వాటిటీ సౌండ్​ కోసం వీటిలో నాలుగు మైక్‌లను కూడా చేర్చింది.

వన్‌ప్లస్ బడ్స్

అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో వన్​ప్లస్​ బడ్స్ Z ఇయర్​బడ్స్​ను కేవలం రూ .2,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. బడ్స్​ Z డాల్బీ అట్మోస్‌ సౌండ్​, డైనమిక్ 3 డి స్టీరియో, IP55 రేటింగ్​తో వస్తుంది. ఇది 20 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. పాసివ్​ నాయిస్​ రెడక్షన్​ను ఆస్వాదించవచ్చు.

జేబీఎల్​ C115

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్​లో స్టైలిష్ జేబీఎల్​  C115 TWS ఇయర్‌బడ్స్​ను కేవలం రూ. 3,498 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిలో బ్లూటూత్ 5, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి ఫీచర్లను చేర్చింది. దీనిలోని బ్యాటరీ ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్​తో ఒక గంట మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

స్కల్‌కాండీ శేష్ ఈవో

అమెజాన్ ఫెస్టివల్​ సేల్‌లో స్కల్‌కాండీ శేష్ ఎవో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ను కేవలం రూ. 4,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.​ ఇవి డస్ట్​, వాటర్​ రెసిస్టన్స్ కోసం ఇవి​ IP55 రేటింగ్‌తో వస్తాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే 24 గంటల బ్యాటరీ లైఫ్​ అందిస్తాయి. కనెక్టివిటీ పరంగా చూస్తే.. వీటిలో బ్లూటూత్ v5.0 ని అందించింది. ఈ ఇయర్​బడ్స్​ 63.5 గ్రాములు బరువు కలిగి ఉంటాయి.

రియల్‌మీ క్యూ 2

అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో రియల్‌మీ బడ్స్ క్యూ 2ను కేవలం రూ .2,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటిలో యాక్టివ్ నాయిస్​ క్యాన్సిలేషన్, టచ్ కంట్రోల్స్, గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లను అందించింది. వీటిని ఛార్జింగ్​ కేస్​లో పెట్టి ఉపయోగిస్తే 28 గంటల బ్యాటరీ లైఫ్​ ఇస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu