Ad Code

కోల్‌కతాలో కిలో టమాటా రూ.72


మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో అకాల వర్షాల వల్ల దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కిలో టొమాటో ధర రూ.72 పలుకుతోంది. అకాల వర్షాలతో గిరాకీకి అనుగుణంగా సరఫరా లేక టొమాటో ధర పెరిగినట్లు కనిపిస్తోంది. నెల రోజుల క్రితం కిలో రూ.38 ఉన్న టోమాటో ధర మంగళవారం కోల్‌కతాలో రూ.72కు చేరుకున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.57, చెన్నైలో రూ.30కి పెరిగింది. ముంబైలో కిలో టొమాటో ధర రూ.15 నుంచి రూ.53లకు దూసుకెళ్లింది. టొమాటో నాణ్యత, లోకాలిటీని బట్టి ధరలు ఆధారపడి ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu