Ad Code

8.5శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం ?

 

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ట్రస్టీల బోర్డుకు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్‌ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నాయి. పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీరేటు.. గత ఏడేళ్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, ఖాతాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు.

Post a Comment

0 Comments

Close Menu