Ad Code

మైక్రోసాఫ్ట్‌లో 85,000 వర్చువల్ ఇంటర్న్‌షిప్స్


ఐటీ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ ఇంటర్‌షిప్స్ ప్రకటించింది. రెండో బ్యాచ్‌లో 85,000 మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తోంది. భారతదేశంలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారంతా ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్-ఏ నాస్‌కామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  డిజిటల్ స్కిల్ ఇనషియేటీవ్, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్, గిట్‌హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలతో కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది మైక్రోసాఫ్ట్. ఆసక్తి గల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాలి. కెరీర్‌లో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడానికి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. విద్యార్థుల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్‌ను గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో బ్యాచ్ ద్వారా 85,000 మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తోంది. ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం 8 వారాలు ఉంటుంది. 2021 లో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులతో పాటు రాబోయే రెండేళ్లలో ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు ఈ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అంటే 2022, 2023లో డిగ్రీ పాస్ అయ్యేవారు కూడా అప్లై చేయొచ్చు. ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 8 వారాలపాటు అంకితభావంతో పూర్తి సమయం కేటాయించి ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలి. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఇందులోనే 100 డాలర్ల విలువైన అజ్యూర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్కౌంటెడ్ సర్టిఫికేషన్స్ కూడా లభిస్తాయి. 8 వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కెరీర్ సపోర్ట్ సేవలు కూడా పొందొచ్చు. మొత్తం 190 గంటల లెర్నింగ్ సెషన్స్, ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu