Ad Code

త్వరలో భారత మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 9ఆర్‌టీ

 

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో 9ఆర్‌టీ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా.. ఆ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ విడుదల చేసింది. చైనాలో రిలీజ్ తర్వాత భారత మార్కెట్‌లోకి ఈ ఫోన్ విడుదల కానుంది. గత సంవత్సరం రిలీజ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్ విడుదల కానుంది. 120 హెచ్‌జెడ్ సామ్‌సంగ్ ఈ4 డిస్‌ప్లే, ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65టీ వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీతో పాటు.. ట్రూ వైర్‌లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్‌) ఇయర్ బడ్స్‌.. వన్‌ప్లస్ బడ్స్ జెడ్‌2ను కూడా లాంచ్ చేయనున్నారు. ఈ ఇయర్‌బడ్స్ 40 డెసిబెల్స్‌ యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu