Header Ads Widget

90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకుంటుంది

 

ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో కూడా డిమాండ్ బాగానే ఉంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఇదే  కాకుండా రోజురోజుకి భారతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎక్కువమంది వాహన వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ఇప్పటికి కూడా చాలా దేశాల్లో సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వేసుకోవడానికి కూడా గంటలు తరబడి వేసి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కావున ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హై-స్పీడ్ బ్యాటరీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే UK కంపెనీ ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీని ఏర్పాటు చేసింది. UK కంపెనీ యొక్క ఈ MAHLE బ్యాటరీ కేవలం 90 సెకన్లలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. అంటే దీని ఛార్జింగ్ సమయం కేవలం ఒక్క నిముషం మాత్రమే. ఇంగ్లాండ్‌లో ఉన్న రెండు కంపెనీలు, MAHLE మరియు Allotrope energy ఈ కొత్త హై స్పీడ్ రీఛార్జబుల్ బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఈ బ్యాటరీ అభివృద్ధి చేయబడింది. ఈ బ్యాటరీ ప్రస్తుతం కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే అభివృద్ధి చేయబడింది. అయితే ఈ బ్యాటరీ త్వరలో ఉపయోగానికి ఆసరమైన విధంగా ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడుతుంది.

Post a Comment

0 Comments