రెండు టైర్ల మీదే ఆటో పరుగు : గిన్నీస్‌ రికార్డు

కొన్ని గంటల ముందే దీనిని గిన్నీస్‌ బుక్ వారు పోస్ట్ చేశారు. ఇందులో తమిళనాడు చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ మణి ఆటో ను రెండు చక్రాలపై నడిపాడు. అలా మొత్తం 2.2 కిలోమీటర్ల దూరం నడిపి... గిన్నీస్‌ బుక్ రికార్డ్ సాధించాడు. "చరిత్రాత్మక ఆటో-రిక్షా సైడ్ చక్రాలది. చెన్నైకి చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జగదీష్ ఇలా ఆటోను సైడ్‌కి నడిపి రికార్డ్ సృష్టించాడు" అని క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా జగదీష్‌ మణి మాట్లాడుతూ.. "ఇలాంటి రికార్డ్ సాధిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు వారు నా టాలెంట్‌ని గుర్తించినందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి కృతజ్ఞతలు'' అన్నారు. ఇప్పటికే ఈ వీడియోని 3 లక్షల మందికి పైగా చూశారు. జగదీష్‌ మణి టాలెంట్‌ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. "భారతీయులు మాత్రమే ఇలా చెయ్యగలరు" అని ఒకరు కామెంట్ ఇవ్వగా... "నేను అందులో ప్రయాణించాలనుకుంటున్నాను".. "ఇది అద్భుతం అంతే" అని మరొకరు కామెంట్‌ చేశారు.

Post a Comment

0 Comments