Ad Code

అరటి పండుతో మీ దంతాలు మిళమిళలా...!



దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనిషికి దంతాలు నవ్వుతో పాటు అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అయితే చాలా మంది మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారి దంతాలు పసుపు రంగులో ఉండటం. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే సమస్యలు కూడా వస్తాయి. అందుకే చాలా మంది తమ దంతాలను తెల్గా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే దంతాలు ముత్యాల్లా చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీ దంతాలపై పసుపు రంగు పోవాలంటే నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా దంతాలు ముత్యాల్లా మెరుస్తాయని చెబుతున్నారు.

అరటి పండు: చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా  ఉంటాయి. అయితే మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపు పచ్చగా కనబడుతుంటాయి. అయితే అరటిపండు.  మన దంతాలను శుభ్రంగా చేస్తుందట. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం..

తొక్కలలో సిట్రిక్ ఆమ్లం: రోజూ అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. వ్యాయామం  చేసే ముందు, ఆ తర్వాత కూడా అరటి పండు తింటారు. దీంతో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. రోజంతా అలసిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. అరటిలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే, అవి ఆరోగ్యానికి (healthy) ఎంతో రక్షణ గా పనిచేస్తాయి. అరటి పండు మన దంతాలను శుభ్రంగా చేస్తుందట. అరటి పండు (banana) తొక్కలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అది మీ దంతాలను తెలుపు రంగులోకి తీసుకువస్తుంది. ప్రతిరోజూ బ్రష్ చేసే ముందు అరటి పండు తొక్కలతో దంతాలను రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేస్తే దంతాలు తెలుపు రంగులోకి మారతాయి. తెల్లటి దంతాలు కావాలంటే.. రోజూ సరిగా బ్రష్ చేసుకోవాలి. టూత్‌ పేస్ట్, ఫ్లోసింగ్, మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం ఇంకా మంచిది. ప్రతీ రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయండి. ఎలక్ట్రిక్, సోనిక్ టూత్ బ్రష్‌లు రెండూ సంప్రదాయ టూత్ బ్రష్‌ల కంటే ఎక్కువగా దంతాలపై ఉన్న పసుపు రంగు మరకలను తొలగించడంలో ఉపకరిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu