Ad Code

భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే !

 

భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనని, రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోందన్నారు. విద్యుత్ వాహనాల విషయంలో అతి పెద్ద ఛాలెంజ్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని తెలిపారు.  శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో 'ఈవీ ట్రేడ్ ఎక్స్ పో'ను మంత్రి జగదీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా..ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ద్వారా కాలుష్యం బారి నుంచి బయటపడవచ్చని, ఏర్పాటు చేసిన ఇలాంటి ఎక్స్ పోల ద్వారా…ఈవీ వాహనాల అమ్మకాలతో పాటు..మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ నెలకొందనే విషయంపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంత్రి జగదీశ్ స్వయంగా నడిపి చూశారు.

Post a Comment

0 Comments

Close Menu