Ad Code

అంబర్‌గ్రీస్‌ స్వాధీనం

 



తమిళనాడు లోని తిరువారూర్‌ జిల్లా ముత్తుపేటలో రూ.8 కోట్ల విలువైన తిమింగళం వ్యర్థం అంబర్‌గ్రీస్‌ను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. అంబర్‌గ్రీస్‌ సముద్రంలో అక్క డక్కడా తేలుతుండగా, కొన్ని తీరప్రాంతాలకు కొట్టుకు వస్తుంటుంది. దీనిని మందులు, విలువైన సుగంధ ద్రవ్యాల్లో వినియోగిస్తుండడంతో అంతర్జాతీయంగా దీని విలువ కోట్ల రూపాయల్లో వుంది. ఈ అంబర్‌గ్రీస్‌ను ముత్తుపేట నుంచి కొందరు అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో గస్తీ పనులు చేపట్టారు. ఉప్పూర్‌ ప్రాంతంలో ద్విచక్రవాహనంలో వస్తున్న ఇద్దరిని అనుమానించిన పోలీసులు, వారిని అడ్డుకొని తనిఖీ చేయగా 8 కిలోల అంబర్‌గ్రీస్‌ లభ్యమైంది. దీనికి దుబాయ్‌ మీదుగా విదేశాలకు తరలించేందుకు యత్నిస్తున్నట్టు విచారణలో తేలడంతో, జాకీర్‌హుస్సే న్‌, నిజాముద్దీన్‌లను అరెస్టు చేసిన అధికారులు వారిని విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu