Header Ads Widget

జియో బంపర్ ఆఫర్‌ !


రిలయెన్స్ జియో కస్టమర్లు కొన్ని చోట్ల నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలోని కస్టమర్లకు కొన్ని గంటలపాటు నెట్‌వర్క్ సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి కస్టమర్లకు జియో రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ ప్లాన్ ఆఫర్  చేసింది. సేవల్లో అంతరాయం కారణంగా ఎదురైన అసౌకర్యానికి పరిహారం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జియో తెలిపింది. ఈ మేరకు ఆయా కస్టమర్లకు జియో ఓ మెసేజ్‌ను కూడా పంపించింది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ ముగిసిన వెంటనే ఈ రెండు రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్ యాక్టివ్ అవుతుందని చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల సర్కిళ్లలో జియో యూజర్లు నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొన్నారు. నిజానికి దేశవ్యాప్తంగా పలు చోట్ల నుంచి జియో నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నట్లు యూజర్లు డౌన్‌డిటెక్టర్‌లో ఫిర్యాదు చేశారు.

Post a Comment

0 Comments