Ad Code

వ్యాక్సిన్‌ తయారీదారులతో మోదీ భేటీ

 


దేశంలోని ఏడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం  సమావేశం జరిగింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌, డాక్టర్‌ రెడ్డీస్ లాబొరేటరీస్‌, జైడస్‌ క్యాడిలా, బయోలాజికల్‌ ఇ, జెన్నోవా బయోఫార్మా, పానాసియా బయోటెక్‌ సంస్థల ప్రతినిధులతో పాటు  ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ కూడా పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధనను మరింత ముమ్మరం చేయడం సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించిన రెండు రోజులకు ఈ భేటీ జరగడం గమనార్హం. అక్టోబరు 21న దేశంలో వ్యాక్సినేషన్‌ 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. ఇప్పటివకు 75శాతం మందికి పైగా అర్హులైన వయోజనులకు తొలి డోసు పూర్తవ్వగా.. 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో సీరమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌తో పాటు స్పుత్నిక్‌-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకోవ్‌-డి వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. అటు బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బివాక్స్‌ టీకాకు అనుమతులు మంజూరు చేయనప్పటికీ ఇప్పటికే 30కోట్ల డోసుల కోసం కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. 

Post a Comment

0 Comments

Close Menu