Ad Code

సీలింగ్‌ ప్యాన్‌ ఈజీ క్లీనింగ్‌ !


సాధారణంగా సీలింగ్‌ ఫ్యాన్‌లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అటువంటప్పుడు ఎక్కువసేపు నిలబడి ఫ్యాన్‌ శుభ్రం చేయడం చాలా కష్టం. అటువంటప్పుడు ముందుగా మీరు టేబుల్‌ పైకి ఎక్కి ఫ్యాన్‌ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్‌ బ్లేడ్‌ని తీసివేసి విడిగా శుభ్రం చేయండి. తద్వారా రెక్కలను కూడా సబ్బుతో శుభ్రంగా క్లీన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా పని జరిగిపోతుంది. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. లేదా  పాత పిల్లో కవర్‌ తీసుకుని టేబుల్‌ మీద ఎక్కి సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కలను కవర్‌ చేయాలి. కవర్‌ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్‌ లోపల వస్తుంది. లేదా పాత షర్ట్‌ లేదా టీషర్ట్‌ ఏదైన కాటన్‌ వస్త్రం సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్‌ మీద పొడి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్‌ను క్లీన్‌ చేస్తున్నట్లయితే..దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటివి సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్‌ చేయాలి.

మీరు ఫ్యాన్‌ను క్లీన్‌ చేసినప్పుడల్లా కింద ఒక షీట్‌ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్‌ క్లీన్‌ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్‌ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్‌ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్‌ లేదా సన్‌గ్లాసెస్‌ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్‌ ఫ్యాన్‌ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్‌ లేదా రుమాలు కట్టుకోవాలి. ఒకవేళ మీకు మెడనొప్పి ఉంటే అడపాదడపా తుడవండి లేకపోతే నొప్పి మరింత పెరుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu