Ad Code

విటమిన్​ సి లోపం - వ్యాధులు - నివారణ

 

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు చర్మ సంరక్షణలో కూడా విటమిన్​ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తూ చర్మ సంరక్షణలో కీలకంగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ సరిగ్గా ఏర్పడటానికి, ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి, గాయాలను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది విటమిన్ సి లోపంతో వచ్చే వ్యాధులు :

స్కర్వి : స్కర్వి అనేది విటమిన్ సి లోపంతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యాధి. ఆహారంలో విటమిన్ సి లోపం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది గాయాలు, చిగుళ్ళ నుండి రక్తస్రావం, బలహీనత, అలసట, దద్దుర్లు వంటి వాటికి దారితీస్తుంది. మరోవైపు, అలసట, ఆకలి తగ్గడం, చిరాకు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది రక్తహీనత, చిగురువాపు, చర్మపు రక్తస్రావం మొదలైన వాటికి కూడా దారితీస్తుంది.

హైపర్ థైరాయిడిజం : థైరాయిడ్ గ్రంథి అధిక హార్మోన్లను స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. మీ థైరాయిడ్ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా కీలకం. విటమిన్ సి లోపం వల్ల థైరాయిడ్ గ్రంథుల నుండి హార్మోన్లు అధికంగా స్రవించి, హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది. తద్వారా అనుకోకుండా బరువు తగ్గడం, గుండె దడ, ఆకలి పెరగడం, భయపడటం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటివి సమస్యలు వస్తాయి.

ఎనీమియా : విటమిన్ సి లోపం వల్ల ఎనీమియా లేదా రక్తహీనత వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఆహారంలో విటమిన్​ సి చేర్చడం చాలా ముఖ్యం. మీ శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా లేదా నాణ్యత తగ్గినా ఎనీమియాగా గుర్తించాలి. దీని వల్ల అలసట, పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, మైకం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

చిగుళ్ళ నుంచి రక్తస్రావం : మీ దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్ సి చాలా అవసరం. ఇది మీ దంతాలను బలోపేతం చేయడమే కాకుండా, చిగుళ్లను కూడా కాపాడుతుంది. అందువల్ల, విటమిన్ సి లోపం మీ చిగుళ్లు రక్తస్రావం, చిగుళ్ల వ్యాధికి దారితీస్తుందని గుర్తించుకోవాలి.

చర్మ వ్యాధులు : చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ సి ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్​ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్​ సి లోపం వల్ల మీ చర్మం, జుట్టు, కీళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మీ చర్మంపై గాయాలు, మచ్చలకు దారితీస్తుంది.

విటమిన్​ సి లోపం ద్వారా వచ్చే వ్యాధులకు చెక్​ పెట్టేందుకు మీ రోజువారీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను చేర్చండి. సిట్రస్ పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ధూమపానం చేసేవారి శరీరంలో విటమిన్ సి తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల ఈ అలవాటు ఉంటే మానేయండి.

Post a Comment

0 Comments

Close Menu