Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, October 23, 2021

సముద్ర అగాధంలో ఏలియన్ జాడలు..!


సముద్రంలోని జీవజాలంపై పరిశోధన చేస్తున్న కొందరు శాస్త్రవేత్తలకు అక్కడ ఒక వింతైన లార్వాలు కనిపించాయట!. అయితే అవి ఏలియన్ లను పోలి ఉన్నాయంటూ వాళ్ళు అనడంతో దీనిపై ప్రపంచానికి ఆసక్తి వచ్చేసింది. సముద్రంలో దాదాపు మూడువేల అడుగులలోతులోకి వెళ్లి నప్పుడు ఈ లార్వాలు కనిపించాయని వాళ్ళు తెలిపారు. ఇక్కడ ఆయా జాతులకు చెందిన అనేక రకాల లార్వాలు ఉన్నాయని వాళ్ళు కనుగొన్నారు. ఈ లార్వాల తలపై ఏలియన్స్ మాదిరి కొమ్ములు ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హీథర్ బ్రాకెన్ గ్రిస్సోమ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ లార్వాలు నారింజ, నీలం రంగులలో వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిపై మరింత పరిశోధన జరపాల్సి ఉందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ విశ్వములో ప్రాణి కేవలం భూమిపైనే ఉందా మరెక్కడైనా ఉందా అనే అన్వేషణ ఆసక్తిపరులు పలువురు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వారందరు ఎప్పటికప్పుడు ఆయా సమాచారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా ఏదైనా ప్రాణి జాడ లభిస్తుందేమో అని వెతుకుతూనే ఉన్నారు. అయితే అలాంటి ప్రాణిని ఏలియన్ గా వారు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైతే అలాంటివి ఏమి కనిపించినప్పటికీ, సాధారణంగా సైన్స్ కు అందని ఎన్నో విషయాలు ఉన్నట్టు రుజువైంది కాబట్టి ఇలాంటి ప్రాణులు కూడా ఎక్కడైనా ఉంటాయనే అన్వేషణ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంది. అలాంటి ఒక అన్వేషణలో భాగంగానే ఈ సముద్రంలోని ఆగాధంలో జీవుల పరిశీలన జరిగింది. అయితే సముద్రం అడుగును చేరుకుంటే అక్కడ మనిషికి కావాల్సిన ఏమైనా వనరులు దొరుకుతాయా అనేది కూడా ఈ తరహా ప్రయోగాల నేపథ్యంగా ఉంది.

No comments:

Post a Comment

Popular Posts