Ad Code

టెస్లాకు జ్యూరీ బృందం జరిమానా !


2015లో టెస్లా కంపెనీలో పనిచేసిన ఓ నల్లజాతీయుడుపై జాత్యాంహకార వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి. ఈ విషయంపై యూఎస్‌ ఫెడర్‌ కోర్టు తన తీర్పును వెల్లడించింది. అయితే ఈ విషయంపై టెస్లా స్పందించలేదు. నల్ల జాతీయుడైన ఓవెన్ డియాజ్ 2015 లో ఫ్రీమాంట్‌ ప్లాంట్‌లో పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్‌ వైట్‌ అమెరికన్‌ వేధించాడని, అంతేకాకుండా జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా ఓవెన్‌ డియాజ్‌ కోర్డును ఆశ్రయించాడు. అయితే దానికి సంబంధించిన తీర్పు శాన్ ఫ్రాన్సిస్కో యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులోని జ్యూరీ బృందం అక్టోబర్‌ 4న వెలువరించింది. అతడిపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని కోర్టు తెలిపింది. డియాజ్‌ మానసిక క్షోభకు గురైనందుకుగాను నష్టపరిహారంగాను 137 మిలియన్‌ డాలర్లను చెల్లించాలని కోర్టు టెస్లాను ఆదేశించింది. ఈ సందర్భంగా ఓవెన్‌ డియాజ్‌ మాట్లాడుతూ...అమెరికాలో నల్లజాతీయులపై జాత్యంహకార వ్యాఖ్యలు ఈ రోజుల్లో సర్వ సాధారణమైనవి. నాకు నాలుగు సంవత్సరాల తరువాత న్యాయం దక్కింది. అమెరికాలో అత్యంత ధనిక సంస్థ టెస్లాలో జాత్యాంహకార వ్యాఖ్యలు రావడం కంపెనీకే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu