Ad Code

పెట్రోల్ కన్నా విమానాల ఇంధనం ధరే తక్కువ!

 


కారే కాదు బైక్ బయటకు తీయాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక కారు బయటకు తీస్తే చెప్పనే అక్కర్లేదు. జేబులు కాదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. బైకు, కార్ల పెట్రోల్ ధర లీటరు రూ.110కు చేరుకోగా అదే విమానం ఇంధనం మాత్ర కేవలం రూ..79 మహా అయితే రూ.80గా ఉంది. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. బైకు సామాన్యుడి వాహనం. కాస్త మెరుగైన ఆర్ధిక పరిస్థితి ఉంటే కారు ఇవే సర్వాసాధారణంగా ఉండే వాహనాలు. కానీ వాటికి కూడా ఇంధనం పోయించే పరిస్థితి లేదిప్పుడు. పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్‌ టర్బో ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయానికి వస్తే రెగ్యులర్‌ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే ఇంధనం లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu