Ad Code

అడివి బాపిరాజు

 

అడివి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవారు.1922 లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్టయ్యారు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించారు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశారు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు. ఈ నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు.1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశారు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదు నుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించారు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు.1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు. బాపిరాజు ఆంధ్రప్రదేశ్ లోని  పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు.1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశారు.1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశారు.తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నారు.'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించిన వారిలో బాపిరాజు ఒకరు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. బాపిరాజుకు చిన్ననాటి నుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్ర గుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరచారు. సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించారు.

Post a Comment

0 Comments

Close Menu