Ad Code

హెచ్‌పీ క్రోమ్ బుక్ పీసీ విడుదల


కంప్యూటర్ల తయారీలో హెచ్‌పీ  సంస్థకు మంచి పేరుంది. ఈ సంస్థ తాజాగా మన దేశంలో 12.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏఎండీ పవర్డ్ క్రోమ్ బుక్ విడుదల చేసింది. 45 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవ్వడం దీని ప్రత్యేకత. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ పీసీని తీర్చి దిద్దారు. హెచ్‌పీ క్రోమ్ బుక్ x360 14a  పేరుతో విడుదలైన ఈ టచ్ ఎనేబుల్ కన్వర్టబుల్ పీసీ.. 14 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ పీసీలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఎనేబుల్ చేశారు. ఒక సంవత్సరం పాటు గూగుల్ వన్ సబ్‌స్కిప్షన్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ eMMC SSD స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. 100 జీబీ ఉచిత క్లౌడ్ సర్వీస్‌ను సంవత్సరంపాటు అందిస్తారు. దీంతోపాటు 256జీబీ మైక్రో ఎస్‌డీ కార్డును సైతం పొందవచ్చు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెచ్‌పీ క్రోమ్ బుక్ x360 14aను తీసుకువచ్చినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం 1.495 కేజీల బరువు అంటే ఒకటిన్నర కేజీల కన్నా తక్కువ బరువు ఉండే విధంగా దీన్ని తయారు చేశారు. మినరల్ సిల్వర్, సిరామిక్ వైట్, ఫారెస్ట్ టీల్ రంగుల్లో మార్కెట్లోకి విడుదల చేశారు. 12.5 గంటల బ్యాటరీ లైఫ్ దీని సొంతం. హెచ్‌పీ ఫాస్ట్ ఛార్జీ టెక్నాలజీ ద్వారా 45 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ చేసుకునే సదుపాయం ఇందులో కల్పించారు. ఇందులో ఏఎండీ రేడాన్ గ్రాఫిక్స్‌ను వినియోగించారు. మల్టీమీడియా, వీడియో కాన్ఫరెన్సింగ్, మెరుగైన గేమింగ్ అనుభవాలను ఈ పీసీ ద్వారా పొందవచ్చు. మల్టీ టాస్కింగ్ విద్యార్థుల కోసం ఫారం ఫ్యాక్టరీలో దీన్ని రూపొందించినట్టు హెచ్‌పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి తెలిపారు. ఇందులో వీడియో కాల్, ల్యాప్ టాప్ వైడ్ హెచ్‌డీ విజన్, వైఫై కనెక్టవిటీ సదుపాయాలు ఉన్నాయి. హెచ్‌పీ క్రోమ్ బుక్ x360 14a 14 అంగుళాల స్కీన్ తో హెచ్ డి టచ్ డిస్ ప్లే 81 శాతం స్కీన్ టు బాడీ రేషియోతో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. HP chromebook 11 అంగుళాల స్క్రీన్ పీసీ ధర రూ.24,999గా ఉంది. హెచ్‌పీ క్రోమ్ బుక్ 14 అంగుళాల స్క్రీన్ పీసీ ప్రారంభ ధర రూ.28,999గా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu