Ad Code

సపోటా పండు - ఉపయోగాలు



సపోటా అధిక పోషకాలు కలిగిన పండు. ఈ పండు గుజ్జు తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. రుచి తియ్యగా ఉండడం వల్ల, జ్యూస్‌గా కూడా చేసుకుని తాగుతారు. జామ పండ్ల కన్నా సపోటా చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ మరియు ఈ, రాగి, ఇనుము మొదలైన ఖనిజ లవణాలు ఉంటాయి. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల, మంచి దృష్టిని పొందడానికి సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది. సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలం. దానివల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషక విలువలు త్వరగా అందుతాయి. ఈ పండు టన్నిన్‌ని అధికంగా కలిగి ఉండడం వల్ల ముఖ్యమైన యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఎసోఫాగిటిస్, పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణ ద్వారా జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఎటువంటి వాపునైనా, నొప్పినైనా తగ్గించడం ద్వారా మంటను కూడా తగ్గిస్తుంది. తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్‌ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తల వెంట్రుకలకు పోషకాలు అందుతాయి.

Post a Comment

0 Comments

Close Menu