Ad Code

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

 


చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్‌ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రంపచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ వ్యాపిస్తుంది. దీంతో అక్కడి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ విజృంభణ వేగంగా ఉండటంతో చైనా ఆందోళన చెందుతుంది. ఇప్పటికే వారం వ్యవధిలోనే మొత్తం 11 ఫ్రావిన్స్‌లకు వేగంగా కేసులు వ్యాప్తి చెందడంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పేషంట్లు ఒక రీజియన్‌ నుంచి ఇంకో రీజియన్‌కు ప్రయాణించారని అందుకే ఇక్కడ వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ఆ దేశ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రతినిధి మీఫెంగ్‌ వివరించారు. వైరస్ ఉన్న ప్రాంతాలు అన్ని ఎమర్జెన్సీలోకి వెళ్లాలని ఆయన సూచించారు. చైనాలోని ఇన్నర్‌ మంగోలియా ఎంజీనా కౌంటీలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుం టున్నారు. సోమవారం నుంచి ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. గన్షు, ఇన్నర్‌ మంగోలియాలోని కొన్ని ప్రాంతాల్లో ట్యాక్సిలను బస్సులను నిలిపి వేశారు.

Post a Comment

0 Comments

Close Menu