Ad Code

పాల నాణ్యతను మొబైల్లో చూసుకోవచ్చు


నిత్యం మనం వినియోగించే పదార్థాలలో పాలు ఎంతో ముఖ్యమైనవి. ఎన్నో పౌష్ఠిక విలువలు కలిగిన పాలను చిన్నారుల నుంచి పెద్దల వరకు నిత్యంసేవిస్తూ ఉంటారు. పాల ద్వారా వివిధ ఆహార ఉత్పత్తులను సైతం ఇంట్లో తాయారు చేసుకుంటాం.., డైరీలలోను లభ్యం అవుతూ ఉంటుంది. శరీరానికి పోషకాలు అందాలన్నా.. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండాలన్నా పాలను తాగడం ఎంతో అవసరం. పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో ఉన్న పోషకాలు, ప్రజల అవసరాల దృష్ట్యా కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తున్నారు. కల్తీపాల తయారీ గురించి ప్రతిరోజూ వార్తలను చూస్తూ వస్తున్నాం. ఎక్కడ కల్తీ పాలను కొనుగోలు చేసేస్తామో అనే భయం అందరిలోనూ ఉంటుంది. నిత్యం మనం వినియోగించే పాలు కల్తీనా లేక స్వత్చమైన పాలా అనేది తెలియదు. తెల్లవన్ని పాలుకాదు అనే సామెత చెప్పుకుంటాంగానీ.. మనం తాగే తెల్లని పాలు సమంచివా కాదా..? అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. పాలల్లో కల్తీని తెలుసుకోవాలంటే ల్యాబుల్లో టెస్టులు చేయాల్సిందే. కాని స్మార్ట్ ఫోన్ తో పాల కల్తీని గుర్తించే టెక్నాలజీని కనిపెట్టారు హైదరాబాద్ (Hyderabad) యువకులు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ పరిశోధనల బృందం పాలలో కల్తీని గుర్తించగలిగే స్మార్ట్‌ ఫోన్ఆధారిత సెన్సార్‌లను రూపొందించింది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్లు సౌమ్య జానా., శివ రామ కృష్ణ వంజర బృందం పరిశోధనను ఇటీవల ఫుడ్ అనలిటికల్ మెథడ్స్ జర్నల్ ను విడుదల చేసింది. ఈ బృందం మొదట పరిశోధన వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది పాలలో ఆమ్లతను కొలవడానికి సూచికగా కాగితాన్ని వినియోగించారు. కాగితంలో రంగు మార్పును ఖచ్చితంగా గుర్తించగల ప్రోటోటైప్ స్మార్ట్‌ ఫోన్ - అనుకూల అల్గోరిథంను అభివృద్ధి చేశారు. ఫోన్ కెమెరాను ఉపయోగించి పాలలో ముంచిన తర్వాత సెన్సార్ స్ట్రిప్స్‌ లోని రంగు మార్పును పరిశీలిస్తుంది. అంతే కాదు ఈ డేటా pH స్థాయిని తెలియజేస్తుంది. 'క్రోమాటోగ్రఫీ మరియు స్పెక్ట్రోస్కోపీ వంటి టెక్నిక్‌లను కల్తీని గుర్తించడానికి వినియోగిస్తారు. ఇటువంటి టెక్నిక్‌లకు సాధారణంగా ఖరీదైన సెటప్ అవసరం ఉంటుంది. తక్కువ ధరలో ఉపయోగించడానికి సులభమైన పరికరాలుగా సూక్ష్మీకరణకు అనుకూలంగా ఉండదు. పాలలో కల్తీని గుర్తించడానికి వినియోగదారుడు ఉపయోగించే సాధారణ పరికరాలను మనం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ పరిశోదన పుట్టుకొచ్చింది. ఖరీదైన సామగ్రి అవసరం లేకుండా... ఈ పారామీటర్లన్నింటినీ ఒకేసారి పర్యవేక్షించడం ద్వారా పాల కల్తీ అరికట్టవచ్చు'అని ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu