Ad Code

వాయిస్ మెసేజ్ ఇక సులభం


మరిన్ని కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. వాట్సప్ మరోకటి వినియోగదారులకు ఉపయోగ పడే ఫీచర్ అందిస్తోంది. అలాంటి ఫీచరే తాజాగా వాట్సాప్‌ యాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ సర్వీస్‌లకు మరో అద్బుతమైన ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్‌ చేయనుంది. మనం వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లను పంపిస్తూ ఉంటాం. వాయిస్‌ మెసేజెస్‌ను స్పీకర్‌ ఐకాన్‌పై ప్రెస్‌ చేసి మెసేజ్‌లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం. స్పీకర్‌  ఐకాన్‌పై ఆన్‌ప్రెస్‌ చేయగానే వాయిస్‌ మెసేజ్‌ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది. వాయిస్‌ మెసేజ్‌ రికార్డు చేసే సమయంలో మెసేజ్‌లను 'పాజ్‌' చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్‌ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్‌ మెసేజ్‌ రికార్డు విషయంలో కొత్తగా పాజ్, ప్లే బటన్లను వాట్సాప్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిలీట్ , సెండ్‌ బటన్‌ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్‌తో మనకు నచ్చినప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. ఈ కొత్త ఫీచర్‌ త్వరలోనే వాట్సాప్‌ బెటా ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. మెసేజ్ రియాక్షన్స్, ఛాట్ బబుల్స్, కాంటాక్ట్ కార్డ్, ఎడిటింగ్ టూల్స్, పేమెంట్ షార్ట్‌కట్ లాంటి ఫీచర్స్‌ని అందించబోతోంది. 

Post a Comment

0 Comments

Close Menu