Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, October 18, 2021

ఎలివేట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఒప్పో ఇండియా

 


టెక్నాలజీ, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దృష్టి సారించిన ఒప్పోఇండియా, నేడు తన ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా, భారతదేశంలో మొత్తం ఆవిష్కరణల సంస్కృతిని వేగవంతం చేయడాన్ని, పరిశ్రమలో తదుపరి దశలో భారీగా సాంకేతిక మార్పును తీసుకువచ్చే సత్తా ఉన్న స్టార్టప్‌లను ఒప్పో లక్ష్యంగా నిర్దేశించుకుంది. బలమైన భాగస్వామ్యాలతో ఒప్పోతన ఎలివేట్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన ఆలోచనతో యువ స్టార్టప్‌లు ఆవిష్కరణలను వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించేందుకు సహకరిస్తుంది. ఒప్పో ఉత్పత్తులు, వనరులు మరియు పంపిణీ, పెట్టుబడి అవకాశాలతో సహా వారి ఆవిష్కరణలను కొనసాగించేందుకు వృత్తిపరమైన సలహా, మద్దతు, అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందిస్తుంది ఈ ప్రయత్నం గురించి ఒప్పోఇండియా, ఉపాధ్యక్షుడు, భారతీయ ఆర్ &డిహెడ్, తస్లీమ్ ఆరీఫ్ మాట్లాడుతూ, 'ఒప్పోద్వారా ఇంతటి భారీ కార్యక్రమానికి నాయకత్వం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒప్పోఎలివేట్ కార్యక్రమం భారతదేశంలోని అత్యంత సాహసోపేతమైన, ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను భేటీ అయ్యేందుకు అలాగే వారితో కలిసి పని చేసేందుకు మాకు దక్కిన ఒక అసాధారణ అవకాశం అని భావిస్తాము. సాంకేతికత ద్వారా అందం, ఊహ, మానవత్వాన్ని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం యువ ఆవిష్కర్తలకు వారి ఉద్దేశాలను మాకు తెలియజేసేందుకు ఇది సరైన వేదిక. ''మానవాళికి సాంకేతికత, ప్రపంచం కోసం దయ'' అనే సిద్ధాంతపు పునాదులపై రూపొందించిన ఒప్పోఎలివేట్ నిత్యం ప్రజల జీవితాన్ని మెరుగుపరచేందుకు యువ ఆవిష్కర్తలకు సాధికారత కల్పిస్తుంది'' అని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ఒప్పో ఇండియా ఇనిస్టిట్యూట్‌లు, ఇంక్యుబేటర్లు, పారిశ్రామికవేత్తలు మరియు పరిశ్రమ నిపుణులతో కలిసి వినూత్న సాంకేతిక పరిశోధన, అభివృద్ధి మార్పిడి, ఏకీకరణను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు నైపుణ్యం, అభివృద్ధికి వేదికను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారం భవిష్యత్తులో కొత్త భావనలు మరియు సాంకేతికతలపై ఒప్పోతో కలిసి పనిచేసేందుకు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇస్తుంది. ఒప్పోచాలా కాలంగా యువతరం శక్తిని విశ్వసిస్తోంది. వారి ఆశయాలను సాధించేందుకు యువతకు మద్దతు ఇచ్చిన దృఢమైన చరిత్రను కలిగి ఉంది. కెమెరా, ఇమేజ్ ప్రాసెసింగ్, బ్యాటరీ, నెట్‌వర్క్‌లు (5జి), సిస్టమ్ పనితీరు, చెల్లింపులు, కృత్రిమ మేధస్సు, గేమింగ్‌కి సంబంధించి నిర్దిష్ట ప్రాంతాల్లో పనిచేసే స్టార్టప్‌లు ఎంటర్‌ప్రెన్యూర్‌లను బ్రాండ్ క్రమపద్ధతిలో అభివృద్ధి చేస్తుంది. ఈ రంగాలలో బ్రాండ్ పుష్ ఆవిష్కరణలకు, భారత మార్కెట్లో కొత్త సాంకేతికతను తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఒప్పోదేశాభివృద్ధికి కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఆవిష్కరణ, వ్యవస్థాపకత కీలకమని గుర్తించింది. ఈ సహకారాల్లో భాగంగా, రెండు రాష్ట్రాలలో స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థను క్రమంతప్పకుండా పెంచేందుకు బ్రాండ్ కేరళ, తెలంగాణ ప్రభుత్వంతో బ్యాటరీ, నెట్‌వర్క్‌లు (5జి), సిస్టమ్ పనితీరు, చెల్లింపులు, కృత్రిమ మేధస్సు, గేమింగ్ తదితర విభాగాల్లో భాగస్వామ్యాలను కలిగి ఉంది ఇటీవల ఒప్పో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ తో ఒక ఏడాది కాలపరిమితి ఉండే భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా యువ సామాజిక పారిశ్రామికవేత్తలను ఆవిష్కరణల ద్వారా సామాజిక సుస్థిరత సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ చొరవతో ఒప్పో యువ పారిశ్రామికవేత్తలకు వారి ఆలోచనలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. యునైటెడ్ నేషన్స్ 2030లో సుస్థిర అభివృద్ధి కోసం అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించడంలో వారికి మద్దతు ఇస్తుంది. అదనంగా, బ్రాండ్ ఒప్పోటెక్ ఇన్నోవేషన్ ఆన్‌లైన్ రోడ్‌షోను నిర్వహిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లను ఆహ్వానిస్తూ ''ఒప్పో 2021 బ్రిడ్జ్ వరల్డ్ వర్చువల్ రోడ్‌షో''లో చేరడానికి అవకాశం కల్పిస్తూ, అక్కడ వారు తమ ఆలోచనలను తెలియజేసేందుకు, అగ్రశ్రేణి పెట్టుబడిదారులను భేటీ అయ్యేందుకు, అంతర్జాతీయంగా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం పొందుతారు.

No comments:

Post a Comment

Popular Posts