Ad Code

హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను ప్రయోగించిన రష్యా

 

రష్యా మొట్టమొదటిసారిగా హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను పరీక్షించింది. ఓ జలాంతర్గామి నుంచి జిర్కోన్ మిస్సైల్ ను ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. కొత్త తరం ఆయుధ వ్యవస్థల్లో జిర్కోన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణితో పోటీకి వచ్చే ఆయుధం మరొకటి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొంతకాలంగా చెబుతున్నారు. ఈ క్షిపణి పరీక్ష వివరాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బేరెంట్స్ సముద్రంలో మోహరించిన సెవరోడ్విన్స్క్ జలాంతర్గామి నుంచి జిర్కోన్ క్షిపణి ప్రయోగం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఫుటేజిని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హైపర్ సోనిక్ క్షిపణుల వేగం, విన్యాసాలు, అవి ప్రయాణించే ఎత్తు రీత్యా వాటిని గుర్తించడం, అడ్డుకోవడం కష్టమని భావిస్తుంటారు. "అణు జలాంతర్గామి నుండి జిర్కాన్ క్షిపణి పరీక్ష ప్రయోగం విజయవంత మైనదిగా పరిగణించబడింది" అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu